Biperjoy cyclone Pics: బిపర్‌జోయ్ తుపాను బీభత్సం ఎలా ఉందో తెలియాలంటే ఈ ఫోటోలు చాలు

Biperjoy cyclone Pics: గుజరాత్‌లో బిపర్‌జోయ్ అతి తీవ్ర తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, రాకాసి అలలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. రాకాసి అలలు గుజరాత్‌లోని ఓ వంతెనను సైతం మింగేస్తున్న దృశ్యాలు భయపెడుతున్నాయి. రాత్రికి పరిస్థితి మరింత విషమించవచ్చని అంచనా.

Biperjoy cyclone Pics: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను ఇప్పటికే తీరం తాకేసింది. గుజరాత్ కచ్ సమీపంలో ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ పాకిస్తాన్ కరాచీ తీరం వరకూ కొనసాగనుంది. సముద్రంలో రాకాసి అలలు ఉవ్వెత్తును ఎగసిపడుతున్నాయి. 3-4 మీటర్ల ఎత్తులో రాకాసి అలలు వచ్చి పడుతున్నాయి. 

1 /8

కచ్, కరాచీ తీరాల్ని అతలాకుతలం చేస్తున్న బిపర్‌జోయ్ ధాటికి రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. రాకాసి కెరటాలు వంతెనను మింగేస్తున్న వీడియో చూస్తే చాలు..పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

2 /8

బిపర్‌జోయ్ తుపానును అత్యంత తీవ్ర తుపానుగా పరిగణిస్తున్నారు. గుజరాత్ కచ్ తీరంతో పాటు ద్వారక, జామ్నా నగర్ జిల్లాల్లో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఊహించినట్టే బలమైన ఈదురుగాలులు విధ్వంసం రేపుతున్నాయి.

3 /8

విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మొత్తం చీకటి అలముకుంది. ద్వారకా, ఒఖా, నాలియా, భుజ్ పోరుబందర్, కాండ్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను కారణంగా ఇప్పటికే లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

4 /8

గుజరాత్ కచ్ తీరంలో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గంటకు 120 కిలోమీటర్ వేగంతో వీస్తున్న గాలులతో పెట్రోల్ బంక్ కప్పులు, చిన్న చిన్న ఇళ్లు, హోటళ్లు కొట్టుకుపోతున్నాయి. విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకొరుగుతున్నాయి. 

5 /8

6 /8

కచ్ జిల్లా జఖౌ ఓడరేవుకు సమీపంలో మాండ్వి, పాకిస్తాన్ కరాచీ మధ్యలో తీరం దాటనుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం గుజరాత్, కరాచీ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

7 /8

8 /8

బిపర్‌జోయ్ తుపాను కారణంగా గంటకు 120 కిలోమీటర్ వేగంతో వీస్తున్న గాలులతో పెట్రోల్ బంక్ కప్పులు, చిన్న చిన్న ఇళ్లు, హోటళ్లు కొట్టుకుపోతున్నాయి. విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకొరుగుతున్నాయి.