Shweta tiwari: బాలీవుడ్ నటి, బుల్లితెర మేటి నటి, మాజీ బిగ్‌బాస్ విన్నర్ శ్వేతా తివారీ గురించి తెలుసు కదా. నలభై ఏళ్ల వయస్సుల్లో కూడా చెక్కు చెదరని ఫిజిక్, అందం ఆమె సొంతం. ఫ్యాషన్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గదు. ఎప్పుడూ లేటెస్ట్ ఫ్యాషన్ అనుకరించడంలో ముందుంటుంది. ఆమె వయస్సు పెరిగే కొద్దీ అందం మరింతగా పెరుగుతోంది. అందుకే అభిమానులు ఆమె ఫోటోల కోసం నిరీక్షిస్తుంటారు. పలాజో ప్యాంట్స్, క్రాప్‌టాప్ స్టైల్ అవుట్‌ఫిట్‌తో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. నాలుగు పదుల వయస్సంటే అసలు నమ్మడమే కష్టం.