Mandakini Life Facts: బాలీవుడ్ దిగ్గజ నటి, అందాల భామ, నాటి తరంలో హట్ క్వీన్‌గా చెప్పుకునే అద్భుత సౌందర్య రాశి మందాకిని ఎవరికైనా గుర్తుందా, సింహాసనం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణతో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన మందాకిని గురించి మీకు తెలియని 8 ముఖ్య విషయాలు మీ కోసం..
Mandakini Life Facts: మందాకిని. నాటి తరం మేటి నటిగా , నాడు కుర్రకారు గుండెల్ని పరవశం చేసిన నటిగా పేరు తెచ్చుకున్న మందాకిని నేపద్యం చాలా గొప్పది. తాతయ్య ఇంగ్లండ్‌కు టెలీఫోన్ కనెక్టివిటీని అందించిన లెజెండ్. కానీ మాఫియా నేత దావుద్ ఇబ్రహీం కారణంగా మందాకిని యాక్టింగ్ కెరీర్ నాశనమైపోయింది. జూలై 30 నాటికి 60 ఏళ్లు నిండుకున్న మందాకిని గురించి కొన్ని ముఖ్య విషయాలు..
మందాకిని ఇప్పుడు కుమార్తె రబ్జ్, భర్త డాక్టర్ కాగ్యూర్ టీ రిన్పోచే ఠాగూర్‌తో కలిసి ముంబైలో ఉంటోంది. మందాకిని సోదరుడు భాను కూడా సినిమా రంగంలోనే ఉన్నాడు. ఒకప్పుడు గుల్షన్ గ్రోవర్ సెక్రటరీగా పనిచేశాడు.
మందాకిని ప్రముఖ డ్యాన్సర్ మిధున్ చక్రవర్తితో కలిసి సూపర్ హిట్ డాన్స్ డాన్స్ , 1987 వంటి సినిమాల్లో చేసింది. 1988లో మాధురీ దీక్షిత్ హీరోయిన్గా వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా తేజాబ్‌లో కూడా కీలక పాత్ర పోషించింది.
వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దోబారాలో సోనాక్షి సిన్హా పాత్ర జాస్మిన్ మందాకిని ఆధారితమైంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. 1996లో మందాకిని నటనకు స్వస్తి చెప్పేసింది. కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడం, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఆమె కెరీర్‌ను నాశనం చేశాయి.
1994లో అండర్ వరల్డ్కింగ్ దావూద్ ఇబ్రహీంతో మందాకిని ఫోటోలు అప్పట్లో సంచలనం రేపాయి. ఇద్దరికీ ఓ కొడుకు కూడా పుట్టాడనే వార్తలు వ్యాపించాయి.. దావూద్ ఇబ్రహీంతో మంచి స్నేహ బందముండేదని ఆ తరువాత ఓ ఇంటర్వ్యూలో మందాకిని అంగీకరించింది. నటిగా దుబాయ్ వెళ్లిన సందర్భంలో ఇరువురికీ పరిచయమైంది.
జలపాతంలో తడుస్తూ రవిక లేకుండా తెల్లటి చీర కట్టుకున్న మందాకినిని ఇప్పుడు చూసినా సెగలు వచ్చేస్తాయి. అప్పట్లో ఇదే బోల్డ్ సీన్
1963లో మీరట్‌లో యాస్మీన్ జోసెఫ్‌గా జన్మించిన మందాకిని వయస్సు 22 ఏళ్లున్నప్పుడు తొలిసారి దర్శకుడు రాజ్ కపూర్ దృష్టిలో పడింది. అతనే స్క్రీన్ పేరును మందాకినిగా మార్చాడు.
బాలీవుడ్ దిగ్గజ నటి మందాకిని వయస్సు జూలై 30కు 60 ఏళ్లు పూర్తయ్యాయి. పుట్టినరోజు పురస్కరించుకుని అందరూ మందాకినిని గుర్తు చేసుకుని విషెస్ తెలిపారు. 1987లో రామ్ తేరీ గంగా మైలీతో పరిచయమైన నటి మందాకిని.
ఇంతకీ మందాకిని తాత గురించి చెప్పుకోలేదు కదా..ఇంగ్లండ్‌కు చెందిన ప్రసిద్ధ వ్యాపారవేత్త, కోటీశ్వరుడు. ఆమె తాతయ్య కంపెనీనే మొత్తం ఇంగ్లండ్‌లో అండర్ వాటర్ టెలీఫోన్ కనెక్టివీటీ ఏర్పాటు చేసింది.