Indian Railways:కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. దీపావళి సందర్భంగా ఏడవపే కమిషన్ ఆధారంగా బోనస్ అందించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రైల్వే ఉద్యోగుల సంఘం చేసిన డిమాండ్కు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
Bonus of Railway Employees: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అందించబోతోంది. ఈసారి దీపావళికి రైల్వే ఉద్యోగులకు పెద్ద మొత్తంలో బోనస్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం నుంచి రైల్వే ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం ఆధారంగా బోనస్ (పిఎల్‌బి)ని లెక్కించాలని రైల్వే ఉద్యోగుల బృందం ఇటీవల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను అభ్యర్థించింది. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఐఆర్‌ఈఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి సర్వ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ ప్రస్తుత బోనస్ ఆరవ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం నెలకు రూ.7,000. కానీ ఏడవ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం రూ.18,000 దీని ఆధారంగా బోనస్ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే కనీస వేతనం రూ.7వేలు ప్రాతిపదికన పీఎల్‌బీని లెక్కించడం వల్ల ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని. కోవిడ్ మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో సైతం రైల్వేలు ప్రజల కోసం పనిచేశాయని గుర్తు చేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే ఆదాయంలో విపరీతమైన పెరుగుదల చోటు చేసుకున్నట్లు త్రైమాసిక నివేదికలో పేర్కొన్నట్లు ఆయన గుర్తు చేశారు. తద్వారా రైల్వే ఉద్యోగులకు ఇప్పుడు మంచి బోనస్ ఇచ్చే అవకాశం ఏర్పడింది అని రైల్వే ఉద్యోగుల సంఘం నేతలు పేర్కొన్నారు.
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ లభించే అవకాశం: రైల్వే ఉద్యోగులు 78 రోజుల ప్రాథమిక వేతనానికి సమానమైన PLB బోనస్ కావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 6వ పేకమిషన్ ప్రకారం అయితే ఈ బోనస్ చెల్లింపు మినిమం వేతనం రూ.7,000 ఆధారంగా రూ.17,951 మాత్రమే లభిస్తుంది. అదే ఏడో వేతన సంఘం ప్రకారం రైల్వేలో కనీస మూల వేతనం రూ.18,000గా నిర్ణయం అవుతుంది. అప్పుడు 78 రోజుల బోనస్ రూ.46,159 లభిస్తుందని రైల్వే ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు.
ఏడవ వేతన సంఘం ఆధారంగా 78 రోజుల బోనస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, ప్రతి ఉద్యోగికి కనీసం (46,159 -17,951) = రూ. 28,208 బెనిఫిట్ లభిస్తుంది. రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఒక లేఖ ద్వారా చేసిన అభ్యర్థనలో, ఏడవ పే కమిషన్ జీతం ప్రకారం రైల్వే ఉద్యోగులందరికీ 7వ పే కమిషన్ ఆధారంగా బోనస్‌ను లెక్కించాలని ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ అభ్యర్థిస్తోంది. దీపావళిలోగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.