BSNL Big Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు ఎగిరిగంతేసే ఆఫర్‌.. ఇది జియో ఎయిర్‌టెల్‌కు అతిపెద్ద సవాల్‌..

BSNL Big Update: బిఎస్ఎన్ఎల్ మరోసారి ప్రైవేటు ఇతర ప్రైవేటు కంపెనీలకు భారీ చాలెంజ్‌ను విసిరింది. 4g రీఛార్జ్ ప్లాన్ తో 82 రోజుల వ్యాలిడిటీ అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉంచింది. వివరలు తెలుసుకుందాం.
 

1 /5

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్ ఈ భారతీయ కంపెనీ ఎయిర్టెల్ జియో వంటి ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు ఛాలెంజ్ విసిరేలా తమ రీఛార్జి ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. దీంతో వినియోగదారులు కూడా ఎక్కువమంది ఈ కంపెనీకి పోర్ట్ అవుతున్నారు. BSNL 4G 5G సర్వీసులను ప్రారంభిస్తున్న నేపథ్యంలో యూజర్లు కూడా పోర్ట్ అవుతున్నారు.  

2 /5

 ప్రముఖ నగరాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన టవర్లు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 4జి సర్వీసులను అందించనుంది. మీరు కూడా బిఎస్ఎన్ఎల్ కు మారాలనుకుంటే బిఎస్ఎన్ఎల్ నుంచి అద్భుతమైన ఆఫర్ వినియోగదారులకు కోసం పరిచయం చేసింది 80 రోజుల వ్యాలిడిటీ అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులో ఉంచింది.  

3 /5

బిఎస్ఎన్ఎల్  రూ.480 రీఛార్జ్ ప్లాన్ చేసుకుంటే 82 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఇక వినియోగదారులు ప్రతిరోజూ 1.5 జిబి డేటా కూడా పొందుతారు. ఇందులో ఆ పరిమిత కాలింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందవచ్చు. బిఎస్ఎన్ఎల్ ప్లాన్ అపరిమిత డేటా లాభాలు కూడా ఎంటిఎన్ఎల్ యూజర్లు పొందవచ్చు.  

4 /5

ఈ రీఛార్జి ప్లాన్ వివరాలను కంపెనీకి చెందిన సెల్ఫ్ కేర్ యాప్ లో ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్ నెంబర్ ఓటిపి తో లాగిన్ అయి నీకు కావలసిన రీఛార్జి ప్లాన్ వివరాలు హోం పేజీలో ఉంటాయి.  

5 /5

ఇక 5జి సర్వీసులను ప్రారంభించే దిశగా బిఎస్ఎన్ఎల్ అడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ కలిసి 5జి టెస్టింగ్  నిర్వహిస్తున్నాయి.  టెలి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సి- డాట్ 5G టెస్టింగ్న్ నిర్వహిస్తున్నాయి. కేంద్రమంత్రి  జ్యోతిరాధిత్య సింధియా బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్కులను ఇటీవలే నిర్వహించినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.