BSNL Cheapest Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ 45 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌.. కేవలం రూ.300 లోపే తెలుసా? ఇంకా మరెన్నో బెనిఫిట్స్..

BSNL 45 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జీ ప్లాన్‌లతో తన కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇతర రీఛార్జీ ప్లాన్లతో పోలిస్తే ఈ ప్రభుత్వ రంగ కంపెనీ అతి తక్కువ ధరలోనే మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ అందుబాటులో ఉంటాయి. ఈరోజు రూ.300 లోపు ఉండే 45 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) ఈ మధ్య కాలంలో దీని క్రేజ్‌ మరింత పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఇతర టెలికాం దిగ్గజాల కంటే ఈ ప్రభుత్వ రంగ టెలికాం ట్యారిఫ్‌లు తక్కువ ధరల్లో ఉండటం. జియో, ఎయిర్‌టెల్‌, వీఐ 45 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.  

2 /7

జియో, ఎయిర్‌ టెల్‌, వీఐలు 28 రోజులు లేదా 30 రోజుల ప్లాన్‌ వ్యాలిడిటీకి ఎక్కువ ధరలు ఉన్నాయి. బీఎస్ఎన్‌ఎల్ మాత్రం 45 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీ ప్లాన్‌తో ఇతర కంపెనీల కంటే తక్కువ ధరల్లో అందిస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు.  

3 /7

ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ కూడా 4జీ నెట్వర్క్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా తమ కంపెనీ సేవలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.  

4 /7

బీఎస్‌ఎన్‌ఎల రూ.249 రీఛార్జ్‌ ప్లాన్‌.. రూ.249 బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌తో 45 రోజుల వ్యాలిడిటీ లభిస్తోంది. ఈ ప్లాన్‌ సుదీర్ఘ కాలంపాటు రీఛార్జీ కావాలనే వారికి ఎంతో లాభదాయకం. ఈ ప్లాన్‌ అపరిమిత కాల్స్‌ అన్ని నెట్‌వర్క్‌లకు పొందడంతోపాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌ లు ఉచితం.

5 /7

ఈ ఫ్రీ కాలింగ్‌ అపరిమిత కాల్స్‌తోపాటు రూ.249 రీఛార్జ్‌ ప్లాన్‌తో డేటా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ కాలంలో 90 జీబీ డేటా వస్తుంది. ప్రతిరోజూ 2 జీబీ డేటా ఇంటర్నెట్‌ యాక్సెస్‌ పొందవచ్చు.  

6 /7

రూ.249 రీఛార్జ్‌ ప్లాన్‌ ఫస్ట్‌ రీఛార్జ్‌ కూపన్‌ (FRC) అని గుర్తుంచుకోండి. అంటే ఈ ప్లాన్‌ కేవలం బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే బీఎస్‌ఎన్‌ఎల్‌కు కొత్తగా స్వీచ్‌ అయిన వారికి కూడా వర్తిస్తుంది. వారికి బెస్ట్‌ డేటాతోపాటు కాలింగ్‌ బెనిఫిట్స్‌ కూడా అందిస్తోంది.  

7 /7

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలా సుదీర్ఘ సమయం పాటు వ్యాలిడిటీ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకు రావడం, దేశవ్యాప్తంగా 4 జీ నెట్వర్క్‌ సేవలను విస్త్రతం చేయడంతో ఈ టెలికాం కంపెనీకి క్రేజ్‌ రోజురోజుకు పెరుగుతోంది. మొబైల్‌ యూజర్ల మొదటి ఎంపిక కూడా ఇదే అవుతోంది.