Anjala Zaveri: అంజలా జవేరి భర్త ఎవరో తెలుసా? టాలీవుడ్ లో పాపులర్ నటుడు…!

Anjala Zaveri Husband: ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ అంజలి జవేరి గురించి తెలియని వారు ఉండరు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు అందరితోనూ కలిసి నటించిన ఈమె.. గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఈమె వైవాహిక జీవితం గురించిన ఒక వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 
 

1 /5

మెగాస్టార్ చిరంజీవితో చూడాలని ఉంది.. కింగ్ నాగార్జున తో రావోయి చందమామ.. వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా.. బాలకృష్ణతో సమరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అంజలా జవేరి. దాదాపు సీనియర్ హీరోలు అందరితోనూ కలిసి నటించి అందరి దృష్టిని ఆకర్షించారు.

2 /5

అయితే ఇంకా తక్కువంతకాలంగా అంజలా జవేరి కెమెరా ముందుకి రావడం మానేశారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు కానీ ఆ తర్వాత మళ్లీ.. వెండి తెర మీద కనిపించలేదు.

3 /5

సినిమాల పరంగా కాకుండా అంజలా జవేరి వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆమెకు పెళ్లయింది అనే విషయం అందరికీ తెలియచ్చు కానీ.. ఎవరిని పెళ్లి చేసుకుంది అనే విషయం చాలామందికి తెలియదు. అయితే ఆమె భర్త తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా బాగా తెలిసిన ఒక నటుడు.   

4 /5

అంజలా జవేరి భర్త మరెవరో కాదు తరుణ్ అరోరా. స్టైల్ గా మోడన్ గా ఉండే తరుణ్ అరోరా.. చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించారు. ఖైదీ నంబర్ 150, జయ జానకి నాయక, కాటమరాయుడు, అర్జున్ సురవరం వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు తరుణ్ ఆరోరా. అయినా పేరు తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు కానీ.. తెలుగు ప్రేక్షకులు ఆయనను చాలాసార్లు తెరమీద చూశారు. 

5 /5

ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే.. అంజల జవేరి తరుణ్ అరోరా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లయి 6 ఏళ్ళు గడిచాయి కానీ ఇంకా పిల్లలు కలగటం లేదు అని ఆవేదన చెందుతున్నారట. ఈ విషయాన్ని తరుణ్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. ఇక కెరియర్ పరంగా చూస్తే.. ఇద్దరూ మంచి అవకాశాలు అందుకుంటున్నారు.