Budha Adithya Raja Yogam Effect On Zodiac Signs: గ్రహ గమనంలో కొన్ని రాశుల కలయికతో మంచి యోగాలు ఏర్పడుతుంటాయి. అలాంటి వాటిలో గ్రహ రాజు సూర్యుడు, గ్రహాల రారాజు బుధుడు కలయిక వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రాశివారికి కొత్త పురోభివృద్ధి మార్గం తెరుచుకుంటుంది, చేసిన పనిలో అపజయం అంటూ ఉండదు.
జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు తర్క, బుద్ధి, కమ్యూనికేషన్ లకు అధిపతి, అంతేకాదు ఉద్యగ, ఉపాధి, వ్యాపారంలో రాణించాలంటే ఈయన అనుగ్రహం ఉండాల్సిందే. త్వరలో బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శనివారం బుధుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికీ అనుకోని అదృష్టం వరించబోతుంది.
సింహ రాశి: సింహ రాశి వారికి బుధాదిత్య రాజయోగం వలన కొన్నేళ్లుగా నిలిచిపోయిన్ పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే అనుకూలమైన సమయం. కొత్త ఇళ్లు, వాహనం కొనుగోలు చేసే వారికి ఇదే మంచి తరుణం. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది.
మేష రాశి : బుధాదిత్య రాజయోగం వలన ఈ రాశి వారికీ పూర్వీకుల ఆస్తులు కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బుధుడి అనుగ్రహంతో ఇతరులు మీ వైపు సులభంగా ఆకర్షితులవుతారు. అంతేకాదు ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు వెంటనే జరిగిపోతాయి. కెరీర్ లో ఉన్నత శిఖరాలు అందుకుంటారు.
కన్య రాశి: బుధాదిత్య రాజయోగం వలన కన్యా రాశి వారికి అనుకోని ఫలితాలను అందుకుంటారు. జీవితంలో కష్టాలను తొలిగిపోతాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. పొదుపు చేయడంలో మీరు విజయం సాధిస్తారు. చేసే వ్యాపారంలో ఉన్నత శిఖరాలు అందుకుంటారు.
కుంభ రాశి : కుంభ రాశికి బుధుడు, సూర్య కలయిక వలన అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇది యోగ కాలం. జీవిత భాగస్వామితో అనుబంధం మెరుగుపడుతుంది.
మిథున రాశి : మిథున రాశి వారికి ఈ యోగం వలన ఉద్యోగంలో సహోద్యోగులు తోడు సహాకారం లభిస్తోంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. పిల్లల వలన మీకు మంచి పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి.
తులా రాశి: బుధుడి ధనుస్సు రాశి సంచారం వలన తులా రాశి రాశి వారికి వ్యక్తిగత, వృత్తి జీవితంలో సానుకూల ప్రభావాలను కలిగిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగులు శుభవార్తలు అందుకుంటారు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్, పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ గోచారంగా చెప్పబడింది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.