Diwali Business Ideas 2024: కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే అతి తక్కువ పెట్టుడితో అధిక లాభాం పొందే బిజినెస్ ఐడియా.. కేవలం రూ. 10,000 పెట్టుబడి పెడితే నెలకు 90 వేలు రావడం ఖాయం. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటి..? ఎలా ప్రారంభించాలి..? అనేది తెలుసుకోండి.
Diwali Business Ideas 2024: ప్రస్తుతకాలంలో చిన్న వ్యాపారాలకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. చిన్న వ్యాపారాలు ఆర్థిక వ్యవస్థలో వెన్నెముక లాంటిది. ఈ వ్యాపారాల వల్ల ఉద్యోగ అవకాశాలు, ఆవిష్కరణను ప్రోత్సహించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలపరుచడంలో కీలక ప్రాత పోషిస్తాయి. డిజిటల్ టెక్నాలజీలు చిన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలను కలిగిస్తున్నాయి. ఆన్‌లైన్ మార్కెటింగ్, ఈ-కామర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ వంటివి చిన్న వ్యాపారాలకు గ్లోబల్ రీచ్‌ను అందిస్తున్నాయి. కొవిడ్-19 మహమ్మారి తర్వాత స్థానికంగా ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు సేవలపై ప్రజల దృష్టి పెరిగింది. స్థానిక వ్యాపారాలను సపోర్ట్ చేయడం ప్రాధాన్యతగా మారింది. మీరు కూడా ఏదైనా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలి ఆలోచిస్తున్నారా..? కేవలం రూ. 10,000 పెట్టుబడితో రూ. 2 లక్షలు సంపాదించవచ్చు.
బ్యాంగిల్స్ అంటే మహిళల అందానికి అద్దం లాంటివి. ఇవి కేవలం ఆభరణాలు మాత్రమే కాదు భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతంలో బ్యాంగిల్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. వివిధ రకాల డిజైన్లు, పదార్థాలతో తయారైన బ్యాంగిల్స్ మహిళల చేతుల అందాన్ని మరింత పెంచుతాయి.
బ్యాంగిల్స్‌లో అనేక రకాలు ఉంటాయి.. అందులో గాజు బ్యాంగిల్స్, లోహపు బ్యాంగిల్స్, ప్లాస్టిక్ బ్యాంగిల్స్, కుందన్ బ్యాంగిల్స్, లాక్ బ్యాంగిల్స్, కడ బ్యాంగిల్స్ ఎంతో ప్రత్యేకమైనవి. ఇవి పండుగ, సాధారణ సమయంలో డిమాండ్ ఎక్కువ.
ఈ దీపావళికి మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే బ్యాంగిల్స్ బిజినెస్ బెస్ట్ ఐడియా.. దీని కోసం మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న పెట్టుబడితో అధిక లాభం పొందవచ్చు.
ఈ బిజినెస్ కోసం కేవలం 10,000తో ప్రారంభించివచ్చు. బ్యాంగిల్ వ్యాపారంలో లాభాల మార్జిన్ 20 నుంచి 50 శాతం వరకు ఉంటుంది. ఒక బ్యాంగిల్‌ను కొనుగోలు చేసి దానిపై 20% నుంచి 50% వరకు లాభం చేసి అమ్మవచ్చు.
ఈ లాభం మార్జిన్ బ్యాంగిల్ నాణ్యత, డిజైన్ దానిని కొనుగోలు చేసిన చోటు దానిని అమ్మే చోటు వంటి అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఇతర వ్యాపారాలతో పోలిస్తే బ్యాంగిల్ వ్యాపారంలో లాభం మార్జిన్ చాలా ఎక్కువ.
బ్యాంగిల్స్ బిజినెస్ తో నెలకు రూ. 90, 000 సంపాదించవచ్చు. కేవలం బ్యాంగిల్స్‌కు ఉన్న డిమాండ్, ధరలు, ట్రెండ్స్ గురించి లోతైన అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. కొత్త డిజైన్లు అమ్మడం వల్ల సులభం ఈ బిజినెస్ ఆదాయం పెరుగుతునే ఉంటుంది.