Game Changer movie news: రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ ఈరోజు విడుదలైంది.ఈ మూవీలో రామ్ చరణ్ ముఖ్యంగా మూడు పాత్రల్లో కన్పిస్తున్నారు. అందులో మెయిన్ గా పవర్ ఫుల్ ఐఏఎస్ పాత్రలో ఆయన కన్పించిన తీరు.. డైనమిక్ నిర్ణయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ మూవీకి మాత్రం మిక్స్ డ్ టాక్ వస్తున్నట్లు సమాచారం. అయితే.. ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు పాత్రలలో కన్పించారు. ఇది ఈమూవీకి హైలేట్ అని చెప్పుకొవచ్చు.
ముఖ్యంగా కాలేజీ యూత్ లుక్, మరోకటి డైనమిక్ ఐఏఎస్ గాను, మరోకటి తండ్రి పాత్రలో కన్పిస్తున్నారు. అయితే.. ఈ మూడింటిలో ఐఏఎస్ పాత్ర మాత్రం ఈ మూవీకి టర్నింగ్ పాయింట్ అని టాక్ విన్పిస్తుంది.
గేమ్ ఛేంజర్ సినిమాకు డైరెక్టర్ శంకర్ వహించారు. అదే విధంగా.. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. అదే విధంగా చరణ్ .. పవర్ ఫుల్ ఐఏఎస్ పాత్ర కోసం..చాలా మంది ఐఏఎస్ ల వీడియోలను చూసినట్లు చెప్పారు. అయితే.. ముఖ్యంగా.. తమిళనాడు క్యాడర్ సీనియర్ ఐఏఎస్.. టీఎన్ శేషన్ జీవితంలోని అనేక అంశాలను, ఆయన నిర్ణయాలను కూడా..చెర్రి పాత్రకు ఆదర్శంగా తీసుకున్నట్లు తెలుస్తొంది
ఒక రకంగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఐఏఎస్ పాత్రకు ఇన్ స్పైరేషన్ టీఎన్ శేషన్ గారేనంట. టీఎన్ శేషన్ ను ఒక సంచలనంతో పాటు.. డైనమిక్ ఐఏఎస్ గా పిలిచే వారు. ఆయన 90 వ దశకంలో అప్పట్లో అనేక ప్రభుత్వాలను, అధికారులకు చుక్కలు చూపించారు.
ముఖ్యంగా ఎన్నికల సంస్కరణలు, బహిరంగా ప్రదేశాల్లో రాజకీయ నాయకుల నోళ్లకు ఒక రకంగా తాళలు పడేలా చేశారంట. ఆయన సంచలన నిర్ణయాలను భరించలేని ప్రభుత్వాలను ఆయను కొన్ని కేసుల్లో ఇరికించినట్లు తెలుస్తొంది. కానీ ఆయన ఏ రోజు కూడా ప్రభుత్వాలకు కానీ.. అవినీతి అధికారులకు గానీ తలవంచయుండా.. తన పనిని బాధ్యతగా నిర్వర్తించారని అందరు చెప్పుకుంటారు.
ఇప్పటికి కూడా టీఎన్ శేషన్ అంటూ.. ఆయన ఒక పని బకాసురుడిగా కూడా పిలిచేవారని గుర్తు చేసుకుంటారు. కేవలం ఎన్నికల సంఘంలోనే కాకుండా పని చేసిన ప్రతి శాఖల్లోకూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని టిఎన్ శేషన్ చేసిన సేవల్ని ఇప్పటికి కూడా కొనియాడుతుంటారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఇలాంటి డైనమిక్ అధికారి చేసిన సేవల్ని మరోసారి గుర్తుచేసే విధంగా మంచి.. పాత్రపోషించినందుకు అభిమానులు చెర్రీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.