New Cars: దసరా పండక్కి కొత్త కారులో ఊరెళ్ళాలని ఉందా.. ఐదు లక్షల లోపు లభించే కార్లు మీకోసం

Cars Under 5 Lakhs: దసరా, దీపావళి పండక్కి చాలా మంది కొత్త వాహనాలు, కొత్త వస్తువులను కొనడం సెంటిమెంట్ గా ఫీలవుతుంటారు. చాలా మంది కొత్త బైక్, కొత్త కారు, కొత్త ఇల్లు కొంటుంటారు. అయితే మీరు కూడా ఈ దసరా పండగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అది కూడా బడ్జెట్ ధరలోనే కావాలా. అయితే రూ. 5లక్షలకే కొత్త కారు సొంతం చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీతో కొత్త కారులో హ్యాపీగా మీ ఊరెళ్లి దసరా పండగ సెలబ్రెట్ చేసుకోవచ్చు. మరి 5లక్షలకు లభించే కార్ల జాబితాను ఓసారి చెక్ చేద్దామా?

1 /6

Cars Under 5 Lakhs: దసరా పండక్కి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే భారత మార్కెట్లో మీ బడ్జెట్ ధరకే లభించే టాప్ బ్రాండ్ కార్లు ఉన్నాయి. అందులో మీరు రూ. 5లక్షల లోపు కార్ల కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే ఇది మీ మంచి సమయం అనుకోవచ్చు. ఒక్కప్పుడు భారత మార్కెట్లో ఈ ధర కంటే తక్కువ మోడల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు కార్లు ఖరీదుగా మారాయి. ఇప్పుడు కొన్ని కంపెనీలకు చెందిన కార్లు కేవలం రూ. 5లక్షలకే అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

2 /6

మారుతి సుజుకి ఆల్టో కె10: మారుతీ దేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్స్ లో ఒకటి. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కారు కూడా ఇదే. ఆల్టూ 800 గతేడాదిలోనే నిలిపివేశారు. ఇప్పుడు ఆల్టూ కె10 ను మాత్రమే మీరు కొనుగోలు చేయవచ్చు. ఆల్టూ కె10 ప్రారంభ ధర రూ. 3.99లక్షలు.  

3 /6

మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో : మారుతీ అందించే మరో సరసమైన మోడల్ మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో . దీని ప్రారంభ ధర రూ. 4.26లక్షలు  

4 /6

రెనాల్ట్ క్విడ్ : రెనాల్ట్ క్విడ్ ధర కూడా చాలా తక్కువే ఉంది. క్విడ్ ప్రారంభ ధర రూ. 4.69లక్షలుగా ఉంది. ఇన్ ఫుట్ ఖర్చులలో మెటీరియల్ ఖర్చులు ఎక్కువగా పెరగడంతో కార్ల ధరలు కూడా పెరుగుతాయి.

5 /6

హ్యాందాయ్ శాంట్రో :ఈ కారు మార్కెట్లో రూ. 4.87లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్స్ బట్టి లీటరుకు 20కిలోమీటర్ల నుంచి 30కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి.ఇందులో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్ లో లభిస్తాయి. 

6 /6

టాటా టియాగో :టాటా కంపెనీకి భారత్ లో మంచి ఆదరణ ఉంది. ఎక్కువ మంది టాటా కార్లను ఇష్టపడుతుంటారు. మీరు కూడా టాటా కంపెనీ కారు కొనుగోలు చేయాలంటే టాటా టియాగో మీకు బడ్జెట్లో లబిస్తుంది. దీని ధర రూ. 5లక్షలు.