Donald trump daughter engagement: అధ్యక్షుడిగా ట్రంప్ చివరిరోజున కుమార్తె టిఫనీ నిశ్చితార్ధం

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్ట్ ట్రంప్ చివరిరోజున..ఆయన చిన్న కుమార్తె టిఫనీ ట్రంప్ ( Tiffany trump ) తన నిశ్చితార్ధపు ప్రకటన చేసింది. మైకేల్ బౌల్స్ ( Michaek Boulos ) తో టిఫనీ ట్రంప్ నిశ్చితార్ధం జరిగింది. ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి.
  • Jan 20, 2021, 19:49 PM IST

Donald trump daughter engagement: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్ట్ ట్రంప్ చివరిరోజున..ఆయన చిన్న కుమార్తె టిఫనీ ట్రంప్ ( Tiffany trump ) తన నిశ్చితార్ధపు ప్రకటన చేసింది. మైకేల్ బౌల్స్ ( Michaek Boulos ) తో టిఫనీ ట్రంప్ నిశ్చితార్ధం జరిగింది. ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి.

1 /5

డోనాల్డ్ ట్రంప్‌కు ఐదుగురు సంతానం. ట్రంప్ ప్రస్తుత భార్య మెలానియా ట్రంప్‌తో 14 ఏళ్ల కుమారుడు బైరన్ ఉన్నాడు. అటు మొదటి భార్య ఇవానా ట్రంప్‌తో 43 ఏళ్ల జూనియర్ ట్రంప్, 39 ఏళ్ల ఇవాంకా, 37 ఏళ్ల ఎరిక్ ఉన్నారు. 

2 /5

అటు టిఫనీ ట్రంప్ మంగేటర్ మైకేల్ బ్లౌస్ వయస్సు 23 ఏళ్లే. నైజీరియా వాసి కుమారుడు మైకేల్.  నైజీరియాలోని లాగోస్ నుంచి ప్రాధమిక విద్య అనంతరం గ్రాడ్యుయేషన్ లండన్‌లో చేశాడు. లండన్‌లో మైకేల్ , టిఫనీలు తొలిసారి కలుసుకున్నారు. 

3 /5

27 ఏళ్ల టిఫనీ ట్రంప్..డోనాల్డ్ ట్రంప్ , అతని రెండో భార్య మాలీ మేపల్స్‌ల ఏకైక సంతానం. ఈమె జార్జ్‌టౌన్ యూనివర్శిటీలోని లా స్కూల్ నుంచి గ్యాడ్యుయేషన్ పూర్తి చేసింది. 

4 /5

టిఫనీ ట్రంప్ తన ఫోటోలతో పాటు మైకేల్ బౌల్స్ ఫోటోల్ని కూడా షేర్ చేసింది. నా జీవిత ప్రియుడితో నిశ్చితార్ధం జరుపుకున్నానని..ఇద్దరూ కలిసి తదుపరి కార్యక్రమం కోసం వేచి చూస్తున్నామని తెలిపింది. 

5 /5

వైట్‌హౌస్‌లో చారిత్రాత్మక సందర్భాల్లో వేడుకలు నిర్వహించడం, కుటుంబంతో గడపడమనేది ఎప్పటికీ మర్చిపోలేని గౌరవమని..కానీ తన మంగేటర్‌తో నిశ్చితార్ధం కంటే ఎక్కువ కాదని డోనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ వ్యాఖ్యానించింది. ఆశీర్వదింపబడుతున్నానని...తదుపరి ఘట్టం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని రాసింది.