DA Hike 2024: కేంద్రం సూపర్ న్యూస్.. రోజువారీ వేతనం భారీగా పెంపు..!

Central Government DA Hike News: కార్మికులకు కేంద్రం ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కార్మికులకు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. వారి ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికులకు అందజేస్తున్న వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కార్మికుల కనీస వేతనం రోజుకు రూ.1035గా ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా..
 

1 /6

పీఐబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కార్మికులకు ప్రభుత్వం నెలవారీ కనీస వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచింది. దేశ ప్రగతిలో కార్మికుల పాత్ర కీలకమని.. వారి సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.  

2 /6

కార్మికులను ఏ, బీ, సీ అనే మూడు వర్గాలుగా విభజించినట్లు అధికారులు వెల్లడించారు.  

3 /6

స్వీపర్లు, నిర్మాణ కార్మికులు, క్లీనర్లు, లోడింగ్, అన్‌లోడింగ్ కార్మికులను ఎ-కేటగిరీ కార్మికులను నాన్ స్కిల్డ్  వర్గంలో ఉంచారు. వీరి రోజువారీ ఆదాయం రూ.783గా ఉంది. అంటే వారినెలవారీ జీతం రూ.20358 అవుతుంది.  

4 /6

B-కేటగిరీ కార్మికులను సెమీ-స్కిల్డ్‌గా పిలుస్తారు. వీరి రోజు కనీసం 868 రూపాయలు పొందుతారు. వారి నెలవారీ ఆదాయం రూ.22,568 అవుతుంది.  

5 /6

C-కేటగిరీ కార్మికులు నైపుణ్యం కలిగిన విభాగంలో ఉన్నారు. వీరి రోజువారీ ఆదాయం రూ.954 అంటే వారి నెలవారీ ఆదాయం రూ.24,804.  

6 /6

ఇక పూర్తి నైపుణ్యం కలిగిన కార్మికులకు  రోజుకు రూ.1035 అందుతుంది. అంటే నెలవారీ ఆదాయం రూ.26,910 అవుతుంది.