Chandrayaan 3: చంద్రునిపై విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌ల పరిస్థితి ఏంటి, ఇస్రో ఏం చెబుతోంది

Chandrayaan 3: ఇవాళ చంద్రయాన్ 3 కు సంబంధించి విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌లు తిరిగి మేల్కొనాల్సిన సమయం. చంద్రునిపై ఇవాళ్టి నుంచి పగలు ప్రారంభం కావడంతో ఇస్రో అధికారులు విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌లను మేల్కొలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 

Chandrayaan 3: చంద్రునిపై ఇవాళ్టి నుంచి పగలు ప్రారంభం కావడంతో 14 రోజులుగా నిద్రావస్థలో ఉన్న ప్రగ్యాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లను మేల్కొల్పనున్నారు. 
 

1 /5

విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవంపై ఉన్న ప్రాంతంలో సూర్య రశ్మి 13 డిగ్రీలుగా ఉంది.

2 /5

చంద్రయాన్ 3 ల్యాండర్ నుంచి ఇప్పటి వరకూ బలమైన సిగ్నల్ లభించలేదు. చంద్రయాన్ 3 ఛానెల్‌పై 2268 మెగాహెర్ట్జ్ఉత్పత్తి అవుతోందని తెలుస్తోంది. 

3 /5

చంద్రుని దక్షిణ ధృవంపై మైనస్ 120 నుంచి మైనస్ 220 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ వాతావరణంలో విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌పై ఎలాంటి ప్రభావం పడిందనేది అవి యాక్టివేట్ అయితేనే తెలుస్తుంది. ఇవాళ పంపిన సంకేతాలకు సరైన స్పందన కన్పించలేదు. 

4 /5

ప్రగ్యాన్ రోవర్ నుంచి లభించిన డేటాను విశ్లేషిస్తున్నారు. చంద్రుని మట్టి, పర్వతాలు, నీటి ఆనవాళ్లు వంటివి మనిషి జీవించేందుకు ఉండే అవకాశాల గురించి తెలుస్తోంది. చంద్రునిపై పగలు ప్రారంభమైన ఇంకా ఉష్ణోగ్రత పెరగనందున విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌ల బ్యాటరీ రీఛార్డ్ కావడం లేదు.

5 /5

చంద్రయాన్ 3 కు సంబంంధి విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌లను రేపు మరోసారి నిద్రలేపే ప్రయత్నం చేయనుంది ఇస్రో. ఇవాళ వాటిని రీ యాక్టివేట్ చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి. రేపు పూర్తి స్థాయిలో వేడి సూర్య రశ్మి అందుతుందని ఆశిస్తున్నారు. 105 మీటర్లు ప్రయాణించింది.