Nagarjuna: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళల పెళ్లి డిసెంబర్ 4న అన్న పూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఇటీవల అక్కినేని వారి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం నాగార్జున పెళ్లి పత్రికలు ఇవ్వడం వేళ చెప్పలేని ఇరకాటంలో ఉన్నారంట.
శోభితా ధూళిపాళ, నాగచైతన్య ప్రేమించి పెళ్లికి సిధ్దపడిన విషయం తెలిసిందే. వీరి ఎంగెజ్ మెంట్ ఆగస్టు 8వ తేదీన కొద్ది మంది సన్నిహితుల మధ్యన సింపుల్ గా జరిగింది. ఆ తర్వాత నాగార్జున కొడుకు, కోడలి ఎంగెజ్ మెంట్ ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరి పెళ్లి కోసం అక్కినేని అభిమానులు ఎంతో క్యూరియా సిటితో ఎదురు చూస్తున్నారంట.
వీరి పెళ్లి వేడుక అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుందని తెలుస్తొంది. అక్కడ అక్కినేని నాగేశ్వర రావు విగ్రహాం ఉంది. దీంతో తమ ఇంటి పెద్ద ఆశీస్సులతో పాటు, కుటుంబం సెంటీమెంట్ ను నెరవేరుతుందని అనుకుంటున్నారంట.
అదే విధంగా ప్రస్తుతం వీరి ఎంగెజ్ మెంట్ అయినప్పటినుంచి ప్రతిరోజు ఏదో ఒక రూమర్స్ వార్తలలో ఉంటున్నాయి. శోభితా ధూళిపాళ అక్కినేని కుటుంబానికి అంత కట్నంతీసుకెళ్తుందని, ఇన్ని లాంఛనాలు తీసుకెళ్తందని వార్తలు వచ్చాయి. శోభితకు కట్టబోయే తాళి బొట్టి విషయంలో కూడా రూమర్స్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
తాజాగా, హీరో నాగార్జున తన కొడుకు రెండో పెళ్లి వెడ్డింంగ్ పత్రికలను పంచే విషయంలో కొత్త ఇరకాటంలో పడ్డారంట. సాధారణంగా పెళ్లిని కొద్ది మందికి మాత్రమే పిలుస్తున్నారని ఇప్పటికే వీరి ఫ్యామిలీ ప్రకటించిన విషయంతెలిసిందే. ఈ క్రమంలో నాగార్జున ప్రస్తుతం ఆలోచిస్తుంది.. సీఎం రేవంత్ రెడ్డి.. కేటీఆర్ లను ఆహ్వానించడంపైనంట..
ఇప్పటికే నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను రేవంత్ సర్కారు అక్రమ నిర్మాణమంటూ కూల్చేసింది. అంతే కాకుండా.. మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై సీఎం రేవంత్ ఏ మాత్రం కల్గజేసుకొలేదని నాగార్జున కాస్త నొచ్చుకున్నారంట. సీఎం రేవంత్ ను పిల్వకుండా.. కేటీఆర్ ను పిలిస్తే.. బాగుండదని కూడా ఆలోచిస్తున్నారంట.
మరోవైపు ఏపీలో కూడా అదే సిట్యూవేశన్..జగన్ కు.. నాగార్జునకు మంచి దోస్తానా ఉందంట. ప్రస్తుతం ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీగా మారింది. దీంతో చంద్రబాబు, పవన్ ను పిలిస్తే.. జగన్ ఏమనుకుంటారో.. లేదా ఒకర్ని పిలిచి మరోకర్ని పిల్వకుంటే.. ఆ తర్వాత ఫ్యూచర్ లో ఎలాంటి తలనొప్పులు వస్తాయో.. అని నాగ్ ఆలోచిస్తున్నారంట. ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నిజంలేదని కూడా కొంత మంది కొట్టిపారేస్తున్నారు.