chettinad chicken masala curry recipe: వర్షాకాలంలో వేడి వేడిగా మసాలా ఘాటుతో.. చెట్టినాడ్ చికెన్ కర్రీ ఇలా చేస్తే.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..!!

chettinad chicken masala curry: వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో వ్యాధులు, ఇన్పెక్షన్లు త్వరగా సోకుతాయి. అయితే వర్షాకాలంలో చల్లని వాతావరణానికి వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ఈ కాలంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్ అనగానే చికెన్ గుర్తుకువస్తుంది. ఎప్పుడూ వండుకునే చికెన్ కాకుండా ఈసారి చెట్టినాడు చికెన్ కర్రీ ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం. 
 

1 /6

chettinad chicken: ఈ వర్షాకాలంలో వేడివేడిగా స్పైసీగా  చికెన్ కర్రీ తినాలని ఉందా? అయితే తమిళనాడు స్టైల్ చెట్టినాడు చికెన్ కర్రీ చేసుకొని తింటే సరిపోతుంది. ఇందులో వాడే ప్రత్యేకమైన మసాలాల  వల్ల దీనికి ఇంత మంచి టేస్ట్ వస్తుంది. ఇది తింటే ఇందులోని ఘాటు మీ నషాలానికి తాకుతుంది. అలా అని ఇది రుచికరంగా ఉండదని కాదు.. ఇందులో వాడే స్పైసెస్  వల్ల మీకు టేస్ట్ తో పాటు.. మంచి ఘాటు కూడా లభిస్తుంది. ఎవరైతే మంచి ఘాటైన టేస్టీ చికెన్ కర్రీ కోసం చూస్తుంటారో వారికి ఈ చెట్టినాడు చికెన్ కర్రీ అనేది.. ఒక మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు. ఈ కర్రీని మీరు అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. లేదా రోటిలో కూడా  నంచుకొని తినవచ్చు. చెట్టినాడు చికెన్ కర్రీ కి ముందు..చెట్టినాడు గరం మసాలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే దీనికి ఆ టేస్ట్ వస్తుంది.ముందుగా చెట్టినాడు మసాలా తయారీ విధానం తెలుసుకుందాం. 

2 /6

చెట్టినాడు మసాల తయారీ విధానం:కావాల్సిన పదార్థాలు: సోంపు గింజలు 2 టీస్పూన్లు, మిరియాలు 2 టీస్పూన్లు, ఎండుమిర్చి  20 గ్రాములు,  జీలకర్ర అర టీస్పూన్,  ధనియాలు 2 టీ స్పూన్లు,  బిరియాని ఆకులు రెండు,  లవంగం పది,  వేయించిన శనగ పప్పు 2 టేబుల్ స్పూన్లు , కరివేపాకు రెండు రెమ్మలు                                                 

3 /6

తయారీ విధానం: పైన పేర్కొన్న పదార్థాలు అన్నింటిని ఒక బాణలిలో సన్నటి మంట మీద వేయించి.. అవి బాగా వేగిన తర్వాత  మిక్సీలో పొడిగా చేసుకోవాల్సి ఉంటుంది.  ఇప్పుడు ఈ పొడిని గాలి చొరబడని కంటైనర్ లో భద్రపరుచుకోవాలి. 

4 /6

చెట్టినాడు చికెన్ కర్రీ తయారీ విధానం: చెట్టినాడు చికెన్ కర్రీ తయారీ కి కావలసిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, జీడిపప్పు, దాల్చిన చెక్క, వంటనూనె

5 /6

ముందుగా చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ ముక్కలు వేసుకోవాలి. వాటిపై అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం, ఉప్పు, పసుపు అలాగే పెరుగు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మ్యారినేట్ ఫ్రిజ్జులో పెట్టి గంటసేపు ఉంచాల్సి ఉంటుంది. ఆ తరువాత స్టవ్ మీద బాణలి పెట్టుకుని అందులో నూనె పోసి ఉల్లిపాయలు తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. 

6 /6

ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలాగే జీడిపప్పు పేస్ట్ వేసి కాస్త ఉడికించుకోవాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు మీరు ముందుగా తయారుచేసి పెట్టుకున్న చెట్టినాడు చికెన్ మసాలాను రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రిజ్లో పెట్టుకున్న చికెన్ మ్యారినేట్ వేసి నీళ్లు పోయాలి. చివర్లో మరో టేబుల్ స్పూన్ చెట్టినాడు చికెన్ మసాలా వేసి కనీసం అరగంటసేపు సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. చివర్లో కొత్తిమీర, నిమ్మకాయ చల్లి వేసి సర్వ్ చేసుకుంటే చెట్టినాడు చికెన్ కర్రీ సిద్ధం అవుతుంది.