Chiranjeevi beats Allu Arjun: ఇంట్లో ఆడవాళ్లకు ఎదురు చెబితే ఎవరికైనా కోపం వస్తుంది. అది సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా.. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను కూడా చిరంజీవి కొట్టారట. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి మెగా ఫ్యామిలీ అండతో అడుగుపెట్టారు అల్లు అర్జున్. ఇప్పుడు తన టాలెంట్ తో ఎదిగి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తాను నటించిన పుష్ప 2 సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి, స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే పుష్ప 2 సినిమా మంచి విజయాన్ని.. అందుకుంది. కానీ సంధ్యా థియేటర్ ఘటన ఆయనను ఆ సక్సెస్ ను అనుభవించేలా చేయడం లేదు.
ఇదిలా ఉండగా మరొకవైపు అల్లు అర్జున్ కి సంబంధించి కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే గతంలో రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ను చిరంజీవి కొట్టిన విషయాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ని నాన్న ఒకసారి కొట్టారు. ఎందుకంటే ఆడవారిని ఎదిరించడం అంటే నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. ముఖ్యంగా అమ్మకు ఏదైనా ఎదురు చెప్పానంటే నన్ను కూడా కొడతారు. అలాగే బన్నీని కూడా కొట్టారు.
ఒకసారి బన్నీ అత్తయ్య (బన్నీ వాళ్ళ అమ్మ) కు ఎదురు మాట్లాడారు. ఆ విషయం నాన్నకు తెలిసింది. అది నచ్చక నాన్న బన్నీని కొట్టారు. అలాగే అల్లు అరవింద్ గారి పెద్దబ్బాయి కి కూడా దెబ్బలు పడ్డాయి.
మా కుటుంబాలలో ఒకటే కామన్ ఇష్యూ.. అదేంటంటే ఆడవాళ్లకు గానూ.. అమ్మకు గానూ ఎదురు చెప్పకూడదు. అది తప్ప మా కుటుంబాలలో మరే సమస్య లేదు. అప్పటి నుంచి మా కుటుంబాలలో అది ఒక రూల్ అయిపోయింది. అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.