Secretariat Employees Salaries News: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించనున్నారు. ఈ విధానం నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు అమలులో ఉంటుందన్నారు. జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు.
గత ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే ఎన్నికలకు ముందు ఈ విధానాన్ని నిలిపివేశారు.
తాజాగా చంద్రబాబు సర్కారు ఈ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని మళ్లీ తీసుకువచ్చింది.
గతంలో ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు ప్రక్రియ ఉండగా.. సమస్యలు ఎదురవ్వడంతో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువచ్చారు.
కాగా.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రోజూ 3 సార్లు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఉ.10.30 గంటల కంటే ముందు, మధ్యాహ్నం.3 గంటలకు, సా.5 గంటల తర్వాత అటెండెన్స్ వేయాలని జీవో జారీ చేసింది.