Cold Waves In Telangana: తెలంగాణలో రోజురోజుకు చలితివ్రత పెరుగుతుంది. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోయాయి... ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా కంటే నాలుగు డిగ్రీల టెంపరేచర్ తక్కువగా నమోదు అవుతున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు ప్రజలు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరింది. హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి..
తెలంగాణలో రానురాను చలి తీవ్రత పెరిగిపోతుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో ఆదిలాబాద్ నిర్మల్ లో ఎల్లో అలెర్ట్ ఇప్పటికే జారీ చేశారు.
అయితే ప్రజలు కూడా ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఈ రెండు రోజులపాటు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అని సూచించింది.
హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయిజజ అంబర్‌పేట 15, వెంగళరావునగర్ 16, రియాసత్ నగర్ 14, మొండా మార్కెట్ 15. ముషీరాబాద్ 15. గోల్కొండ 13. ఆసిఫ్ నగర్ 15. చాంద్రాయణగుట్ట 15. వెస్ట్ మారేడుపల్లి 12. ఓయు 16 ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా రెండు రోజుల పాటు చలి తీవ్రత మరింత ఉంటుందని ఈ నేపథ్యంలో తగిన దుస్తులు వేసుకోవాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చలి కోట్లు తప్పనిసరిగా ధరించాలి. మంకీ క్యాప్ ని కూడా ధరించాల్సి ఉంటుందని అయితే ఉదయం పూట బయటకు వెళ్ళకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు.