Cricket Records: అత్యధిక గెలుపు శాతంతో టాప్‌ ప్లేస్‌లో రోహిత్ శర్మ.. ఆ తరువాతి స్థానాల్లో ఎవరంటే..?

Captains With Highest Win Percentage: అంతర్జాతీయ క్రికెట్‌లో తమ నాయకత్వ పటిమతో జట్టును గెలిపించిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. మైదానంలో ఎప్పటికప్పుడు బౌలింగ్‌లో మార్పులు.. ఫీల్డింగ్‌ సెటప్‌లో తమదైన మార్క్ చూపించి విజయాలను అందుకున్నారు. వన్డే క్రికెట్‌లో అత్యధిక గెలుపు శాతం ఉన్న కెప్టెన్లపై ఓ లుక్కేద్దాం..
 

  • Oct 31, 2023, 23:55 PM IST
1 /6

వన్డే క్రికెట్‌లో కనీసం 100 మ్యాచ్‌ల సారథ్యం వహించిన కెప్టెన్‌లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధిక విజయ శాతాన్ని కలిగి ఉన్నాడు. రోహిత్ శర్మకు 74 విజయ శాతం ఉంది.   

2 /6

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 324 మ్యాచ్‌ల్లో 220 విజయాలతో 70.51 అంతర్జాతీయ క్రికెట్‌లో 2వ అత్యుత్తమ విజయ శాతాన్ని కలిగి ఉన్నాడు.    

3 /6

దివంగత దక్షిణాఫ్రికా కెప్టెన్ హన్సీ క్రోంజే 191 మ్యాచ్‌ల్లో 126 విజయాలతో 67.02 విజయ శాతం సాధించాడు.   

4 /6

ఆఫ్గానిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ 115 మ్యాచ్‌ల్లో 78 విజయాలతో 69.64 విజయ శాతాన్ని కలిగి ఉన్నాడు.  

5 /6

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా కెప్టెన్‌గా తన కెరీర్‌లో 163 ​​మ్యాచ్‌లలో 108 విజయాలతో 66.67 విజయ శాతం సాధించాడు.  

6 /6

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 213 మ్యాచ్‌ల్లో 135 విజయాలతో 64.6 విజయ శాతం సాధించాడు.