Diabetes Control Tips: ఈ ఐదు పదార్ధాలు డైట్‌లో ఉంటే..మందుల్లేకుండానే డయాబెటిస్‌కు చెక్

మధుమేహం నియంత్రించడం చాలా కష్టం. ఒకసారి డయాబెటిస్ సోకితే జీవితాంతం అప్రమత్తంగానే ఉండాలి. ఇన్సులిన్ వరకూ రాకుండా ఉండేట్టు చూసుకోవాలి. అందుకే ఎప్పుడూ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండాలి. అందుకే మీ డైట్‌లో ఈ ఐదు రకాల పదార్ధాలుండేట్టు చూసుకుంటే..డయాబెటిస్ నియంత్రించుకోవచ్చు.

Diabetes Control Tips: మధుమేహం నియంత్రించడం చాలా కష్టం. ఒకసారి డయాబెటిస్ సోకితే జీవితాంతం అప్రమత్తంగానే ఉండాలి. ఇన్సులిన్ వరకూ రాకుండా ఉండేట్టు చూసుకోవాలి. అందుకే ఎప్పుడూ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండాలి. అందుకే మీ డైట్‌లో ఈ ఐదు రకాల పదార్ధాలుండేట్టు చూసుకుంటే..డయాబెటిస్ నియంత్రించుకోవచ్చు.

1 /5

ఓట్స్ ఓట్స్ తినడం వల్ల డయాబెటిస్ అద్భుతంగా నియంత్రితమౌతుంది. ఓట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ రోగులు ఓట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకోవచ్చు.

2 /5

నేరేడు కాయలు నేరేడు గ్రైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నేరేడు డయాబెటిస్ నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తుంది.

3 /5

గ్రీన్ వెజిటబుల్స్ గ్రీన్ వెజిటబుల్స్ డయాబెటిస్ నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తాయి. పాలకూర తినడం వల్ల బ్లడ్ షుగర్ ఎప్పుడూ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఫైబర్, మెగ్నీషియం పోషకాలు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రిస్తాయి.

4 /5

చియా సీడ్స్ చియా సీడ్స్ మధుమేహం వ్యాధి నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తాయి. షుగర్ స్థాయిని తగ్గిస్తాయి. చియా సీడ్స్‌లో ఉండే ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచిది

5 /5

బాదం బాదం తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే మెగ్నీషియం బ్లడ్ షుగర్‌ను నియంత్రిస్తుంది. బాదంలో మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ప్రోటీన్లు, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి.