Family Digital Card: రేషన్‌, ఆరోగ్యం, పింఛను అన్నింటికీ ఒకటే డిజిటల్‌ కార్డు.. ఎలా పని చేస్తుందంటే?

Family Digital Card: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుతో రేషన్‌, ఆరోగ్య సేవలు పొందవచ్చు. తుది దశకు చేరుకున్న డిజిటల్‌ కార్డుతో ఏ ఉపయోగాలు ఉంటాయి తెలుసుకుందాం.
 

1 /7

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత  కరెంటు కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి పథకం మినహాయించి మిగతా అన్ని సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు లింక్‌ పెట్టారు. అయితే, కొన్ని లక్షల మంది కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.   

2 /7

ఈలోగా తెలంగాణ కాంగ్రెస్‌ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డును తెరపైకి తీసుకువచ్చింది. ఇందులో మహిళను ఇంటి పెద్దగా పరిగణిస్తారు. ఈ కార్డుతో రేషన్‌, ఆరోగ్య, పింఛను ఇతర పథకాల సేవలను కూడా పొందవచ్చు. అన్నింటికీ ఒకటే కార్డు, అర్హులందరికీ ఒకే రాష్ట్రం, ఒకే కార్డును ముందుకు తీసుకువచ్చింది. దీనికి సంబంధించి సర్వే కూడా ప్రారంభించారు.   

3 /7

రానున్న సమయంలో అన్ని జిల్లాల్లో కూడా సర్వే మొదలు పెట్టనున్నారు. అధికారులు ఇళ్లకు వెళ్లి కుటుంబ యజమాని మహిళ ఇతర వివరాలను సేకరించనున్నారు అధికారులు. ఆ వివరాలు సేకరించిన తర్వాత ప్రత్యేకంగా ఓ క్యూఆర్‌ కోడ్‌ జారీ చేస్తున్నారు. దీని ద్వారానే అర్హత కలిగి లబ్దిదారులకు పథకాలు అందనున్నాయి  

4 /7

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుపై కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా తీసుకోనున్నారు. ఈ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుతో స్కాన్‌ చేయగానే ఏ పథకానికి అర్హులు అవుతారో సులభంగా తెలుసుకోవచ్చు. వారి పూర్తి వివరాలు కూడా తెలుసకోవచ్చు. ఇప్పటికే 119 నియోజక వర్గాల్లో ముఖ్యంగా గ్రామాల్లో సర్వే ప్రారంభమైంది. క్యూఆర్‌ కోడ్‌ అంటేనే సైబర్‌ ఫ్రాడ్‌ జరిగే అవకాశం ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎంత వరకు అమలు చేయనుందో చూడాలి.  

5 /7

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాల అమలు తీరును కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. దేశంలో మరో నాలుగు రాష్ట్రాల్లో ఈ కార్డు విధానం అమలు అవుతుంది.  

6 /7

తెలంగాణలో కూడా ఈ డిజిటల్ కార్డు విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో మెరుగైన అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం తుదిదశకు చేరుకుంది. ఫ్యామిలీ అంతటికీ కలిసి ఓ క్యూఆర్‌ కార్డును జారీ చేస్తారు.   

7 /7

అయితే, అభయహస్తంలో భాగంగా కొత్త రేషన్‌ కార్డుల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, దీని అమలు ఎంతవరకు అవుతుందో చూడాలి. డిజిటల్‌ కార్డు అయితే, ఆధార్‌ కార్డు మాదిరి కుటుంబానికి ఓ గుర్తింపు కార్డులా పనిచేస్తుంది. ఈ కార్డులపై అధికారులు సమావేశం అయి పైలట్‌ ప్రాజెక్టు కూడా చేపట్టారు.