Trivikram Remuneration: దర్శకుడు త్రివిక్రమ్ కి తెలుగు ప్రేక్షకులలో ఎంతటి అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు.. తన మాటలతో ప్రేక్షకుల మదిలో మాయ చేశారు. ఇక ఈ దర్శకుడు పుట్టినరోజు ఈరోజు కావడంతో.. త్రివిక్రమ్ తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ వివరాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా, కథా రచయితగా, దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈయన డైలాగ్ లు రాసారంటే చాలు న్యూక్లియర్ లా పేలిపోవాల్సిందే.తన అద్భుతమైన టాలెంట్ తో డైలాగులు రాసి హీరోలకు మంచి గుర్తింపు అందించారు.
ఇకపోతే భీమవరంలో జన్మించిన ఈయన న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం ఎస్ సి పూర్తి చేశారు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా పని చేసిన ఈయన సాహిత్యం పై ఉన్న ఆసక్తితోనే సినిమా రంగంలోకి ప్రవేశించారు. సినిమా అవకాశాల కోసం హైదరాబాదుకు వచ్చిన ఈయన పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరి.. ప్రముఖ నటుడు సునీల్ తో కలిసి ఒకే గదిలో రూమ్ షేర్ చేసుకున్నారు.
1999లో స్వయంవరం అనే సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ మొదటి రెమ్యూనరేషన్ ఎంత? అంటూ ఒక ప్రశ్న తెరపైకి రాగా ఆయన నటించిన తొలి చిత్రానికి ₹2,000 మొదటి పారితోషకం గా అందుకున్నారు. మాటల రచయితగా తొలి చిత్రానికి పని చేయగా.. అందులో ఈయన పేరు టైటిల్స్ లో వేయకపోవడం వల్ల ఈ పారితోషకం ఇచ్చినట్లు సమాచారం.
ఇక తర్వాత తన అద్భుతమైన టాలెంట్ తో డైలాగులు రాస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుని, ఇప్పుడు ఒకవైపు దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. భార్య ఆధ్వర్యంలో నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు.