Disha Patani: టైట్ ఔట్‌ఫిట్‌లో దాచినా దాగని దిశా పటానీ అందాలు.. కల్కి భామ గ్లామర్ ట్రీట్‌ ఫ్యాన్స్ ఫిదా..

Disha Patani: దిశా పటానీ.. నార్త్  భామ అయిన సౌత్ సినీ ఇండస్ట్రీలో ముందుగా లెగ్ పెట్టింది.   పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' మూవీతో సిల్వర్ స్క్రీన్‌కు ఇంట్రడ్యూస్ అయింది. ఈ చిత్రం రిలీజైనపపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా హాట్ సమ్మర్‌లో టైట్ డ్రెస్‌లో సెగలు పుట్టిస్తోంది.

1 /7

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని  బరేలీలో జన్మించిన దిశా పటానీ.. ముందుగా మోడల్‌గా పనిచేసింది.  ఆ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది.  

2 /7

దిశా స్టార్టింగ్ నుంచి మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేయడం ఈ భామ స్పెషాలిటీ.

3 /7

తెలుగులో 'లోఫర్' మూవీతో పరిచయమైన దిశా పటానీ.. హిందీలో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ' మూవీతో బాలీవుడ్‌లో విజయ పతాకం ఎగరేసింది. 

4 /7

ఎప్పటి కప్పుడు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈమెకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 61 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

5 /7

దిశా పటానీ ఏ మాత్రం టైమ్ దొరికిన సోషల్ మీడియాలో అభిమానులతో మాటామంతీ అంటూ చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను  ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. 

6 /7

రీసెంట్‌గా సిద్దార్ధ మల్హోత్ర హీరోగా నటించిన 'యోధ' మూవీతో పలకరించింది. ఈ సినిమాకు టాక్ బాగానే ఉన్న ఓ మోస్తరు వసూళ్లనే రాబట్టింది.

7 /7

ప్రస్తుతం హిందీలో టాప్ కథానాయికగా రాణిస్తోన్న దిశా పటానీ.. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'కల్కి 2898 AD' మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది.  అటు సూర్య హీరోగా నటిస్తోన్న 'కంగువా'లో కథానాయికగా నటిస్తోంది.