Divi Vadthya Saree Photos: బ్లాక్ కలర్ శారీలో సెగలు రేపుతున్న దివి.. ఎద అందాలతో వలపు వల!

Divi Vadthya Black Colour Saree Photos: తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా హీరోయిన్లతో సమానమైన ఫాలోయింగ్ సంపాదించింది దివి. తెలుగమ్మాయి కావడంతో ఆమెకు మరింత ప్లస్ అయింది. ఇక తాజాగా కొంపల్లిలోని సినీ ప్లానెట్ సమీపంలో ఏర్పాటైన ఇండో అరబిక్ రెస్టారెంట్‌ను మల్లారెడ్డితో కలిసి దివి ప్రారంభించారు.  ఈ సందర్భంగా అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తూ అక్కడ వంటలు రుచి చూశారు.

 
  • Apr 06, 2023, 08:18 AM IST

 

 
1 /5

తెలుగు అమ్మాయి దివి మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా అందరికీ పరిచయమైంది. నిజానికి ఆ పాత్ర ఆమె చేసిందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ ఆమె ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ ఫోర్లో ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.  

2 /5

బిగ్ బాస్ ఫినాలే లో ఆమెను చూసిన మెగాస్టార్ చిరంజీవి ఏకంగా తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడంతో ఒక్కసారి తెలుగు ప్రేక్షకులు అందరికి నోటెడ్ అయిపోయింది. మాటిచ్చినట్టుగానే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఆమెకు గాడ్ ఫాదర్ సినిమాలో అవకాశం ఇచ్చారు.  

3 /5

ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. ఆ సంగతి అలా ఉంచితే బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. తాజాగా ఈ భామ కొంపల్లి సినీ ప్లానెట్ సమీపంలో ఏర్పాటు అయిన ఇండో అరబిక్ రెస్టారెంట్ ను మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించింది.  

4 /5

ఈ సందర్భంగా అభిమానులతో సెల్ఫీ దిగుతూ సందడి చేయడమే కాదు అక్కడి వంటకాలను సైతం రుచి చూస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఈ ప్రారంభోత్సవానికి ఆమె నల్ల రంగు చీర ధరించి బ్లూ కలర్ జాకెట్ ధరించి హాజరైంది.    

5 /5

ఈ చీరకట్టులో కూడా ఆమె అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఇవ్వడంతో అభిమానులు రకరకాల కామెంట్లు పెట్టి ఆమె అందాలను ఆస్వాదిస్తున్నారు.