Divya Arundhati Engagement Photos: అనుష్క శెట్టి నటించిన 'అరుంధతి' సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫీమేల్ లీడ్ రోల్‌లో అనుష్క నటించింది. ఈ సినిమా టాలీవుడ్‌లో తిరుగులేని మార్కును నమోదు చేసింది. అయితే అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్న జేజమ్మ ప్రస్తుతం ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ ఫొటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ నటన కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆమె అసలు పేరు దివ్య నగేష్. దివ్య ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో తెలుసుకుందాం.
అరుంధతి సినిమా ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ అయినా మంచి పేరు కలెక్షన్లు సాధించింది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా దివ్య నగేష్ యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే ఆ నటనకు ఆమెకు నంది అవార్డు కూడా దక్కింది. అయితే ప్రస్తుతం దివ్యా నరేష్ ఎంగేజ్మెంట్ చేసుకుంది.
ఆ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. దివ్య అజికుమార్ అనే వ్యక్తిని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి. అందరూ ఆమెకి విషెస్ కూడా చెప్తున్నారు.
దివ్య అజి కుమార్‌లది ప్రేమ వివాహం.. తనకు హ్యాపీగా ఉంది అంటూ దివ్య నగేష్ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసింది.
చైల్డ్ ఆర్టిస్టుగా అరుంధతి సినిమా తర్వాత దివ్య నగేష్ వివిధ సినిమాల్లో నటించింది కానీ దానికి పెద్దగా సక్సెస్ సాధించలేదు.
ఇక అజి కుమార్ విషయానికొస్తే ఆయన కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. వీళ్లిద్దరూ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు.
దివ్య నగేష్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటారు.