Diwali Discount Offer: అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా.. దిమ్మతిరిగే ఆఫర్‌..


Diwali Discount Offer 2024: అత్యంత తక్కువ ధరలోనే ఈ దీపావళి సందర్భంగా కొత్త టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో దివాళికి సంబంధించిన సేల్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అన్ని రకాల టీవీలపై బంపర్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని టీవీలపై 50% పైగా తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా కొన్ని స్మార్ట్ టీవీ లపై ప్రత్యేకంగా కొన్ని కూపన్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  అయితే అత్యంత చౌక ధరకు మార్కెట్లో లభిస్తున్న టీవీ ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
 

1 /6

ప్రముఖ ఎలక్ట్రిక్ బ్రాండ్ థామ్సన్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్ టీవీలను విడుదల చేయడంతో చాలామంది ఈ కంపెనీలకు సంబంధించిన టీవీలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫ్లిప్కార్ట్ దీపావళి సందర్భంగా ఈ బ్రాండ్ కు సంబంధించిన టీవీలపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది.  

2 /6

Thomson Phoenix 108 సెంటీమీటర్స్ కలిగిన QLED అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిపై అదనంగా ఫ్లిఫ్‌కార్ట్‌ దీపావళి సందర్భంగా కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 31,999 కాగా.. దీపావళి సందర్భంగా 31 శాతం తగ్గింపుతో లభిస్తుంది. 

3 /6

ఇక ఈ స్మార్ట్ టీవీ పై ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను కేవలం ఈ స్మార్ట్ టీవీని రూ.21,999కే పొందవచ్చు. ఇవే కాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ పొందడానికి ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు తో పేమెంట్ చేయాల్సి ఉంటుంది.   

4 /6

ఈ స్మార్ట్ టీవీ ని ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే దాదాపు రూ.2,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా డెబిట్ కార్డును వినియోగించి కూడా ఈ ప్రత్యేకమైన దీవాలి డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. దీంతో ఈ ఆఫర్ పోను రూ.19,449కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఇతరు బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ పొందవచ్చు. 

5 /6

ఇక ఈ స్మార్ట్ టీవీ పై నో కాస్ట్ ఇఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ నో కాస్ట్ ఇఎంఐ పొందాలనుకునేవారు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులతో బిల్ చెల్లించి ఈఎంఐ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు.   

6 /6

అలాగే ఈ స్మార్ట్ టీవీ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు వినియోగిస్తున్న ఎలాంటి స్మార్ట్ టీవీనైనా ఎక్స్ఛేంజ్ చేసి ఈ కొత్త స్మార్ట్ టీవీ ని అత్యధిక తగ్గింపు ధరతో పొందవచ్చు. అయితే పాత టీవీని ఎక్స్చేంజ్ చేస్తే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ కండిషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. పాత టీవీని ఎక్స్చేంజ్ చేసిన తర్వాత దాదాపు రూ.3,000 వరకు బోనస్ లభిస్తుంది.