Samantha Ruth Prabhu: నటి సమంత వాడుతున్న మొబైల్ ఫోన్ మీద ఇంకా కూడా పాత ఫోటోలను డీపీగా అలాగే పెట్టుకుందంట. దీంతో ఇటీవల మళ్లీ సమంతా మొబైల్ ఫోన్ మీద ఉన్న వాల్ పేపర్ అంశం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీంతో నెటిజన్ లు మరోసారి సమంతా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తొంది.
నటి సమంతా తరచుగా ఏదో అంశంతో ఇటీవల కాలంలో వార్తలలో ఉంటున్నారు. కొన్నిసార్లు వివాదాస్పద అంశాలతో వార్తలలో ఉంటే, మరికొన్నిసార్లు ఏదో ఒక ట్రిప్, మూవీకి సంబంధించిన అప్ డేట్ తో ట్రెండింగ్ లో ఉంటున్నారు.
ఇటీవల సమంతా దీపావళి వేడుకలను రాజస్థాన్ లోని రణ థంబోర్ లో సింగిల్ గా జరుపుకున్నారు. అంతే కాకుండా రణ థంబోర్ కోటలో దీపాలు సైతం వెలిగించారు.
అంతే కాకుండా.. రణ థంబోర్ నేషనల్ పార్కులో సంచరిస్తు కూడా అక్కడ పచ్చని నేచర్ ను ఎంజాయ్ చేశారు. అంతే కాకుండా.. మరికొన్ని రోజుల్లో ఆమె వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరిస్ ఆడియన్స్ ముందుకు రానుంది. నవంబరు 7 న మూహుర్తం ఖరారు చేసినట్లు తెలుస్తొంది.
ఇదిలా ఉండగా.. నటి సమంతా ఏమాయ చేశావే సినిమా చేసిన తర్వాత నాగ చైతన్యతో ప్రేమలో పడ్డారు. ఆతర్వాత పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత అనూహ్యంగా వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సమంతా ఒక్కసారిగా కుంగిపోయినట్లు తెలుస్తొంది.
ఆ తర్వాత మయోసైటిక్ కు కూడా గురైంది. ఆమె దీని కోసం ఎంతో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత తరచుగా వివాదాస్పద అంశాలు ఆమెను చుట్టుముట్టినట్లు తెలుస్తొంది.
దీంతో ఆమె కోయంబత్తురులోని ఈషా ఫౌండేషన్ లో ఉన్న లింగ భైరవీ మాత ఆలయంకు వెళ్లేందంట. అయితే.. చైతో పెళ్లి తర్వాత కూడా లింగభైరవీమాత ఆలయంకు వెళ్లేదని తెలుస్తొంది. అప్పుడు కూడా ఆమె మొబైల్ వాల్ పేపర్ గా అమ్మవారి ఫోటో ఉండేదంట.
ఆ తర్వాత కూడా సమంతా పలు మార్లు లింగ భైరవీ అమ్మవారి ఆలయంకు వెళ్లి ప్రత్యేకంగా పూజలు సైతం చేశారు. ఇప్పుడు కూడా సమంతా మొబైల్ వాల్ పేపర్ మీద లింగ భైరవీ మాత ఫోటోను వాల్ పేపర్ గా అలానే పెట్టుకుందని తెలుస్తొంది.
మరోవైపు సమంతా ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో వార్తలలో నిలిచారు. దీన్ని సమంతా ఖండించారు. సామ్ కు సినిమా ఇండస్ట్రీ అంతా సపోర్ట్ గా నిలిచారని చెప్పుకొవచ్చు.