Constipation Remedy: బొప్పాయిలో ఈ ఒక్కటి కలిపి తింటే మలబద్దకం నిమిషాల్లో మాయం...

Constipation Remedy: మలబద్ధక సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. దీనికి సరైన జీవనశైలి అనుసరించాలి. కొంతమంది ఎన్ని మందులు తీసుకున్న ఈ సమస్య సద్దుమణగదు. దీనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. 
 

1 /5

ముఖ్యంగా నిద్రలేమి, స్ట్రెస్‌, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల ఇతర అనేక ఆరోగ్య సమస్యలు సైతం మిమ్మల్ని వెంటాడుతాయి. అయితే, ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువులతో ఈ మలబద్ధకం సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.  

2 /5

చియా గింజలు ఈ గింజలు కూడా మలబద్ధకమ సమస్యకు ఎఫెక్టీవ్‌ రెమిడీగా పనిచేస్తాయి. చియా విత్తనాల గురించి మాట్లాడితే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇతర అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇది ముఖ్యంగా పేగు కదలికలను సులభతరం చేస్తుంది.   

3 /5

బొప్పాయి గురించి చెప్పాలంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది డయాబెటీస్‌తో బాధపడేవారు సైతం తమ డైట్లో చేర్చుకోవచ్చు. అంతేకాదు బొప్పాయి కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. తద్వారా పేగులను శుభ్రం చేసి విష పదార్థాలను బయటకు పంపించేస్తుంది.  

4 /5

చియా గింజలతో పాటు బొప్పాయి రెండూ మలబద్ధకంలో సమస్యకు ఎఫెక్టీవ్‌ రెమిడీగా పనిచేస్తాయి. దీన్ని ఎలా తీసుకోవాలంటే మీరు రాత్రి పడుకునే ముందు చియా విత్తనాలను నానబెట్టండి. ఉదయాన్నే దీంతోపాటు బొప్పాయిని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వీటిపై చియా విత్తనాలను చల్లుకుని తినవచ్చు.   

5 /5

ముఖ్యంగా బొప్పాయిలో జీర్ణ ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. బొప్పాయిలో చియా సీడ్స్ మిక్స్ చేసి తింటే చాలు మలబద్ధక సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )