Tirumala: తిరుమలలో మహిళలు పూలు ఎందుకు పెట్టుకోకూడదు తెలుసా..?

Tirumala Rules: మహిళలకి పువ్వులు ఎంత ఇష్టమంటే ఏ చిన్న పువ్వు దారిలో కనిపించినా.. వెంటనే తుంచి కొప్పులో పెట్టుకుంటారు. అయితే అలాంటి ఆడవారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పువ్వులు పెట్టుకోకూడదని చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.

1 /5

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం భక్తులు భక్తిశ్రద్ధలతో తరలివస్తారు. అయితే తిరుమల కొండపైన పాటించాల్సిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అందులో పుష్పాలంకరణ ప్రత్యేకమైనది. మహిళలు పూలు పెట్టుకోకూడదు.. ఇదెక్కడి విడ్డూరం అని ఆలోచిస్తున్నారా..?  ఇది అక్షర సత్యం.. కొండపై భక్తులు పుష్పాలంకరణ నిషిద్ధం. దీనికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.  

2 /5

శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే కొండపై పూసిన పుష్పాలు ఆ వెంకటేశ్వరుడికే చెందాలి అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.  అందుకే కొండపైన ఎవరు కూడా పూలు పెట్టుకోరు. ఇక్కడ పురాణాలలో మరో కథ ప్రచారంలో ఉంది. ప్రాచీన కాలంలో వెంకటేశ్వర స్వామి అలంకరణ కోసం ఉపయోగించే పువ్వులను భక్తులకు ఇచ్చేవారు వారు ఆ పుష్పాలను పరమ పవిత్రంగా భావించి భక్తిశ్రద్ధలతో ఆడవాళ్లు తలలో మగవాళ్ళు చెవిలో పెట్టుకునేవారు. 

3 /5

అయితే ఒకసారి శ్రీశైల పూర్ణుడు అనే ఒక పూజారి శిష్యుడు వెంకటేశ్వర స్వామి అలంకరణకు ఉపయోగించాల్సిన పువ్వులను తాను అలంకరించుకున్నాడట అయితే ఆ రాత్రి శ్రీనివాసుడు ఆ పూజారి కలలో కనిపించి నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు అంటూ కన్య చేశాడట. ఆ తర్వాత శ్రీశైలం పూర్ణుడు ఎంతగానో మదనపడ్డాడు. ఇక అప్పటి నుంచే కొండపైన ఉన్న పుష్ప సంపద మొత్తం వెంకన్నకే చెందాలని నియమం పెట్టారట. 

4 /5

అంతేకాదు స్వామివారికి అలంకరించిన పువ్వులను వాడిన తర్వాత భక్తులకు ఇవ్వకుండా పూల బావిలోనే వేసే ఆచారం కూడా అప్పుడే మొదలైంది. ఇకపోతే దేవాలయాలకు వెళ్లేటప్పుడు ఆడంబరాలకు పోకుండా ఏకాగ్రతతో దర్శనానికి వెళ్తే మంచిదని వేద పండితులు కూడా చెబుతున్నారు. 

5 /5

ఇకపోతే పువ్వుల బావిలో వేసిన పువ్వులతో అగరవత్తులు తయారు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  ఇక్కడ వృధా అన్నది ఎక్కడ లేదు అని చెప్పడానికి చక్కటి నిదర్శనం.