IPL 2022 Highest Earned Players: ఐపీఎల్ 2022లో ఎక్కువ ధర పలకనున్న క్రికెటర్లు వీళ్లే..విరాట్, ధోనీలు కానే కాదు

ఐపీఎల్ 2022లో అత్యధిక ధరకు అమ్ముడుకానున్న క్రికెట్ ప్లేయర్స్ ఎవరో తెలుసా. విరాట్ కోహ్లీ లేదా ఎంఎస్ ధోనీ అనుకుంటే పొరపాటే. అనూహ్యంగా కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లు 16-20 కోట్ల ధర పలకనున్నారని తెలుస్తోంది. అది కూడా ఈసారి కొత్తగా వస్తున్న లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు దక్కించుకోనున్నాయి.

IPL 2022 Highest Earned Players: ఐపీఎల్ 2022లో అత్యధిక ధరకు అమ్ముడుకానున్న క్రికెట్ ప్లేయర్స్ ఎవరో తెలుసా. విరాట్ కోహ్లీ లేదా ఎంఎస్ ధోనీ అనుకుంటే పొరపాటే. అనూహ్యంగా కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లు 16-20 కోట్ల ధర పలకనున్నారని తెలుస్తోంది. అది కూడా ఈసారి కొత్తగా వస్తున్న లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు దక్కించుకోనున్నాయి.

1 /5

రవీంద్ర జడేజా : చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఆణిముత్యంగా ఉన్న రవీంద్ర జడేజా ఫస్ట్ పిక్‌లో 16 కోట్లు దక్కించుకోనున్నాడు.

2 /5

రోహిత్ శర్మ : ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ..ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిపెట్టిన క్రికెటర్. ఈసారి అతని ధర 16 కోట్లుగా ఉంది.

3 /5

రషీద్ ఖాన్ : ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకుంది. ఈసారి అతన్ని 16 నుంచి 18 కోట్లు చెల్లించి లక్నో లేదా అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు సొంతం చేసుకోవచ్చు. 

4 /5

రిషభ్ పంత్: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఈసారి 16 కోట్లు పలకనున్నాడు. గతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే.

5 /5

కేఎల్ రాహుల్ : టీమ్ ఇండియా టీ20 వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈసారి అంటే ఐపీఎల్ 2022లో అత్యధిక ధర పలకనున్న క్రికెటర్ కావచ్చని తెలుస్తోంది. లక్నో ఫ్రాంచైజీ టీమ్ రాహుల్‌కు 20 కోట్లు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఆ టీమ్‌ను కూడా రాహుల్ లీడ్ చేయవచ్చని సమాచారం.