Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!

AP Dussehra School Holidays 2024: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులను 2024 అక్టోబర్‌ 4 నుంచి సెలవులు ప్రకటించారు. పాఠశాలలు తిరిగి అక్టోబర్‌ 13 ప్రారంభం కానున్నాయి. అయితే సెలవులు పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

AP Dussehra Holidays 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ దసరా హాలిడేలను ప్రకటించారు. విద్యాశాఖ అక్టోబర్‌ 4 నుంచి 13 వరకు సెలవులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 రోజులపాటు సెలవులు ప్రకటించింది.  

2 /5

దసరా, సంక్రాంతి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే పెద్ద పండుగలు. అయితే, ఏపీ దసరా సెలవులను విద్య శాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.  

3 /5

అయితే, మహాలయ అమావాస్య అక్టోబర్‌ 2 రానుంది. ఈ సందర్భంగా అక్టోబర్‌ 2 నుంచే అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఆర్‌జేయూపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. ఆరోజు గాంధీ జయంతి కూడా రానుంది. ఈ సందర్భంగా 3 వ తేదీ కూడా సెలవు ఇస్తే ధార్మిక క్రతువులు చేసుకోవడానికి వీలుంటుందని ఓ ప్రకటన విడుదల చేశారు.  

4 /5

పితృపక్షం 15 రోజులపాటు ప్రతి ఏడాది నిర్వహిస్తారు. అయితే, ఇది సెప్టెంబర్‌ 18న ప్రారంభమై, అక్టోబర్‌ 2 మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. ఇదిలా ఉంగా ఇప్పటికే భారీవర్షాలు వరదల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ఎక్కువగానే వచ్చాయి. ఈ మాసంలో వర్కింగ్‌ డేస్‌ తగ్గిపోయాయి. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.  

5 /5

దీపావళి సెలవు అక్టోబర్‌ 31న రానుంది. ఈ రోజు కూడా అన్నీ స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవు రానుంది. ఇది రెండూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు వర్తిస్తుంది. దీపావళి కూడా దేశవ్యాప్తంగా అంగరంగ వైభంగా నిర్వహించుకునే పండుగ.