Mobile Tariffs: ఎయిర్‌టెల్‌ జియో వీఐలకు భారీ షాకిచ్చిన యూజర్లు.. ఎన్ని లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయో తెలుసా?

Increased Mobile Tariffs: ఇటీవలె అన్నీ ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలపై ట్యారిఫ్‌లను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ కు మారారు.  ఏ కంపెనీలు ఎన్ని లక్షల మంది యూజర్లను కోల్పోయాయో  తెలుసుకుందాం.
 

1 /5

టెలికాం ధరలు పెరగడంతో దిగ్గజ ఎయిర్‌టెల్‌, జియో, వీఐ కంపెనీ యూజర్లు లక్షల సంఖ్యలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ అయ్యారు. ఈ కంపెనీలు దాదాపు 27 శాతం వరకు ట్యారిఫ్‌లు పెంచాయి.  

2 /5

రీఛార్జీ ప్లాన్‌ ధరలు అదనంగా మారడంతో చాలామంది ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు. ఎందుకంటే అన్నీ ప్రైవేటు రీఛార్జీ ప్లాన్లతో పోలిస్తే వీటి ధరలు తక్కువగా ఉండటమే ప్రధాన కారణం.  

3 /5

ఈ నేపథ్యంలో ఈ మార్పును దృష్టిలో పెట్టుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా యూజర్లను ఆకట్టుకునేందుకు మరిన్ని కొత్త రీఛార్జీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అతి తక్కువ ధరలో ఏ ప్రైవేటు రీఛార్జ్‌ ప్లాన్స్‌ దీని దరిదాపుల్లో లేదు.  

4 /5

దీంతో దిగ్గజ ఎయిర్‌టెల్, జియో, వీఐ కంపెనీలు లక్షల్లో తమ వినియోగదారులను కోల్పోవాల్సి వచ్చింది. జియో 7.58 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోతే, ఎయిర్‌టెల్‌ 16.9 లక్షలు, వీఐ 14.1 లక్షల వినియోగదారులను కోల్పోయాయి.  

5 /5

ఇదిలా ఉండగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు మాత్రం ఏకంగా 29 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు మారారు. త్వరలో ఈ కంపెనీ 5జీ సేవలను ప్రారంభించడానికి సన్నహాలు చేస్తోంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో 4 జీ సేవలను ముమ్మరం చేసింది.