Ice Cream: మనలో చిన్న పెద్దా తేడాలేకుండా ప్రతిఒక్కరు ఐస్ క్రీమ్ ను ఎంతో ఇష్టంతో తింటారు. ముఖ్యంగా సమ్మర్ లో ఎక్కువ మంది ఐస్ క్రీమ్ ను తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
ఐస్ క్రీమ్ ను చిన్న పెద్దా తేడాలేకుండా ప్రతిఒక్కరు ఎంతో ఇష్టంతో తింటారు. ఎక్కువ మంది సాయంత్రంకాగానే ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్లి ఐస్ క్రీమ్ ను తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు, ఎలాంటి ప్రొగ్రామ్ లు జరిగిన కూడా ఐస్ క్రీమ్ లు తప్పనిసరిగా పెడుతున్నారు.
బైట మార్కెట్ లో లభించే ఐస్ క్రీమ్ లు అనేక ఫ్లెవర్లలో లభిస్తుంటాయి. దీనిలో వెనీలా, చాకోబార్, ఫ్రూట్స్ మిక్స్, చాక్లెట్ వంటి అనేక ఫ్లెవర్లలో మనకు మార్కెట్ లలో ఐస్ క్రీమ్ లు లభిస్తుంటాయి. దీనిలో డ్రైఫ్రూట్స్ లను కూడా కొందరు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
ముఖ్యంగా మన ఇంట్లోనే ఈ ప్రాసెస్ తో సింపుల్ గా ఇలా ఐస్ క్రీమ్ లను తయారు చేసుకొవచ్చు. మొదటగా క్రీమ్ మిల్క్ ప్యాకెట్ లను తెచ్చుకొవాలి. ఒక గిన్నెలో కొన్ని పాలు వేసి గ్యాస్ మీద పెట్టాలి. కొన్నిపాలను మరో గిన్నెలో తీసుకొవాలి. గ్యాస్ మీద పెట్టిన పాలను ఒక ఐదునిముషాల పాటు మరిగించాలి
మరిగించిన పాలల్లో కస్టర్డ్ పౌడర్ ను కలపాలి. దానిలో చక్కెర వేసి చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలపాలి. కాసేపు గ్యాస్ మీద వేడిగా ఉండేలా చేసి, ఆ తర్వాత మంటను ఆర్పేసి ఒక రెండు గంటలపాటు ఆ గిన్నెను పక్కన మూతపెట్టి పెట్టాలి.
ఆ తర్వాత మరో గిన్నెలో.. అమూల్ క్రీమ్ లేదా మీకు అందుబాటులో ఉన్న పాల మీగడ, వెన్నకోసం తీసి పెట్టిన క్రీమ్ లను తీసుకొవాలి. దీన్ని అడుగు కాస్త మందంగా ఉన్న కడాయ్ లో వేసుకొవాలి. ఆ తర్వాత.. క్రీమ్ ను స్పూన్ తో మిక్స్ చేయాలి. దీనిలో డ్రైఫ్రూట్స్, కాజు, కిస్మిస్, బాదంపలుకులు వేయాలి.
ఇలా డ్రైఫ్రూట్స్, కుంకుమ పువ్వు కలిపిన వాటిని మరల చక్కగా మిక్స్ చేసుకొవాలి. ఆ తర్వాత వీటన్నింటిని బాగా మిక్స్ చేసి, డీప్ ఫ్రిడ్జీలో ఒక రాత్రంతా పెట్టుకొవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్రీమ్ గిన్నె బైటకు తీసి చూస్తే ఐస్ క్రీమ్ రెడి. దీన్ని గిన్నెలో వేసుకుని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయోచ్చు.Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)