PF Withdrawal Rules: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ పీఎఫ్ ఎక్కౌంట్ అనేది తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఈపీఎఫ్ఓ నిర్వహించే దీర్ఘకాలిక సేవింగ్ పధకమిది. కనీస వేతనంలో 24 శాతం ప్రతి నెలా పీఎఫ్ ఎక్కౌంట్‌లో జమ అవుతుంటుంది.
PF Withdrawal Rules: పీఎఫ్ ఎక్కౌంట్ అంటే ఉద్యోగి జీతం నుంచి 12 శాతంతో పాటు యాజమాన్య వాటా రెండూ కలిపి జమ ప్రతి నెలా జమ చేస్తుంటారు. రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో అందుకోవచ్చు.
సాధారణంగా పీఎఫ్ అనేది ఉద్యోగ విరమణ సమయంలో మాత్రమే పొందే డబ్బు, కానీ కొన్ని ప్రత్యేక కారణాలు అంటే ఆరోగ్యం, పిల్లల చదువు, ఇంటి మరమ్మత్తులు లేదా కొనుగోలుకు డబ్బులు అవసరమైనప్పుడు కొద్దిమొత్తం అడ్వాన్స్ రూపంలో విత్‌డ్రా చేయవచ్చు. అదెలాగనేది తెలుసుకుందాం.
సొంత ఇళ్లు అనేది చాలామందికి ఓ కల. పీఎఫ్ ఎక్కౌంట్‌తో ఈ కలను సాకారం చేసుకోవచ్చు. ఎందుకంటే పీఫ్ ఎక్కౌంట్ నుంచి ఇంటి కొనుగోలు నిమిత్తం డబ్బులు ముందే విత్ డ్రా చేసుకోవచ్చు.
పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ లేదా ఉమంగ్ యాప్ ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియలో అప్లై చేయవచ్చు. ముందుగా యూఏఎన్ నెంబర్‌తో లాగిన్ అవాలి
ఎక్కౌంట్‌లో లాగిన్ అయిన తరువాత మేనేజ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఫారమ్ 31 ఫిల్ చేయాలి. ఇంటి కొనుగోలు అగ్రిమెంట్ కాపీ, ఇతర పత్రాలు సమర్పించాలి. ఇంటి రెన్నోవేషన్ కోసమైతే ఇంటి పత్రాల్ని సమర్పించాలి.
పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి గరిష్టంగా ఇంటి కొనుగోలు కోసం మీ కనీస వేతనం లేదా జమ చేసిన మొత్తానికి 24 రెట్లు పొందవచ్చు.
ఇంటి మరమ్మత్తులకైతే కనీస వేతనానికి 12 రెట్లు విత్ డ్రా చేయవచ్చు. సాధారణంగా పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలంటే కనీసం ఐదేళ్లు సభ్యత్వం పూర్తవ్వాలి.
పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి విత్ డ్రా చేసిన డబ్బులు వడ్డీ రహితం అయినందున అదనపు రుణాలు తీసుకోకుండా ఉండవచ్చు. పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఎలాంటి గ్యారంటీ అవసరం లేదు.
మీ పీఎఫ్ ఎక్కౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. రిజిస్టర్ ఫోన్ నెంబర్ నుంచి 01122901406 కు మిస్డ్ కాల్ లేదా ఉమంగ్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.