PF Money Withdrawal: ప్రభుత్వ , ప్రైవేటు ఉద్యోగులకు తప్పనిసరి పీఎఫ్ ఎక్కౌంట్. నెల నెలా ఇటు ఉద్యోగి అటు యజమాని నుంచి కొద్దిమొత్తం ఫీఎఫ్ ఖాతాలో జమ అవుతుంటుంది. ఎప్పుడైనా అవసరం వస్తే పీఎఫ్ డబ్బులు అడ్వాన్స్‌గా విత్ డ్రా చేసుకోవచ్చు. అదెలాగో పూర్తి ప్రక్రియ తెలుసుకుందాం.
EPFO 3.0 : ఉద్యోగం చేసేవారికి దాదాపుగా పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఉద్యోగి, కంపెనీ ప్రతినెల పీఎఫ్ కు డబ్బు చెల్లిస్తుంటారు. సీబీటీ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ పనిచేస్తోంది. ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటుంది. తాజాగా ప్రావిడెంట్ ఫండ్ కీలక మార్పు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో 2025 జులై నాటికి ఈపీఎఫ్ఓ చందాదారులు డెబిట్ కార్డు తరహాలో డబ్బులు విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
EPF Withdraw Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు మారాయి. ఇక పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి పాక్షికంగా డబ్బులు డ్రా చేసుకునే నియమాల్లో మార్పు వచ్చింది. పీఎఫ్ కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి.
PF Account Withdrawal Limit Increased: ఈఫీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి విత్ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఒకేసారి రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా తెలిపారు. ఇప్పటివరకు కేవలం రూ.50 వేల వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రూ.లక్షకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. మారుతున్న వినియోగాలకు అనుగుణంగా లిమిట్ పెంచినట్లు చెప్పారు. దీంతో పీఎఫ్ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
How To Complaint EPFO: ఇటీవల కొన్ని కంపెనీలు పీఎఫ్ కట్ చేసినటలు పే స్లిప్స్‌లో చూపిస్తున్నా.. ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోకి మాత్రం జమ చేయట్లేదు. ఈ విషయంపై ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈపీఎఫ్ఓకు సరైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. మీ డబ్బులు తిరిగి పొందొచ్చు.
Withdraw PF amount from Umang App at Home: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కస్టమర్ల సౌకర్యం కోసం అప్డేట్స్ అందిస్తుంటుంది. ఇందులో భాగంగా ఇంట్లోంచే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PF Withdrawal Process Online 2023: మీరు పీఎఫ్ అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేస్తున్నట్లయితే కచ్చితంగా కొన్ని విషయాలు ముందే తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ యూఏఎన్‌తో ఆధార్, బ్యాంక్ వివరాలు లింక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా..
EPF Money For Marriages: ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద పొదుపు చేసుకున్న మొత్తాన్ని పదవీ విరమణ చేసిన తర్వాత మొత్తం డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. సర్వీసులో ఉండగా అయితే.. ఇంటి నిర్మాణం, ఇంటికి మరమ్మతులు, హౌజింగ్ లోన్ ఈఎంఐ రీపేమెంట్ లేదా హోమ్ లోన్ క్లోజింగ్, వివాహం వంటి అవసరాల కోసం పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
కరోనా కారణంగా (Coronavirus) ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను (Financial crisis) అధిగమించేందుకు కేంద్రం సైతం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను విత్‌డ్రా (Withdraw EPF money) చేసుకోవడం సులభతరం చేసింది. ఈమేరకు గత వారమే కేంద్ర కార్మిక శాఖ ఓ నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.