ESIC Medical Posts:ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ ప్రక్రియ ద్వారా 608 వేకెన్సీలను భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2025 జనవరి 31. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్న ఖాళీల వివరాలు ఇవే.
మొత్తం 608 పోస్టులకు రిక్రూట్మెంట్ చేపట్టింది.. ఇందులో యుఆర్ 254, ఎస్సీ 63, ఎస్టి 53, ఓబిసి 178, ఈడబ్ల్యూఎస్ 60, బిడబ్ల్యూబిడి 90.
మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ బి కి కావలసిన అర్హత వివరాలు... ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభివృద్ధిలో ఎంబిబిఎస్ డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 ప్రకారం కలిగి ఉండాలి. ఇంకా రొటేటింగ్ ఇంటర్ షిప్ కూడా పూర్తి చేసి ఉండాలి.
ఈ పోస్టు చేసి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కలిగి ఉండాల్సిన అర్హత.. సీఎంఎస్సీ 2022 డిస్క్లోజర్ లిస్ట్ 35 ఇయర్స్ మించకూడదు. ఇక సీఎంఎస్సీ 2023 డిస్క్లోసర్ లిస్టు ప్రకారం 35 ఏళ్లు మించకూడదు.అయితే ఎస్సీ, ఎస్టీ, ఓ బి సి, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ లకు వయోపరిమితి ఉంది.
ఈ రిక్రూట్మెంట్లో ఎంపికైన అభ్యర్థులకు రూ.56000 నుంచి రూ.1,77,500 వరకు అందించనున్నారు. ఇది కాకుండా అదనంగా డిఏ, హెచ్ఆర్ఎ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఉంటుంది.
పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సీఎం ఎస్సీ 2022 లిస్టు అభ్యర్థులకు మొదట ప్రాధాన్యత ఇస్తారు