Latest 2025 New Year Mehndi Designs: న్యూ ఇయర్ వేడుకలు మొదలవుతున్నాయి. అందరూ కొత్త దుస్తులు, ఆభరణాలతో అలంకరించుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అందానికి మరింత మెరుగులు చేర్చడానికి మెహందీ కళ ఎంతగానో ఉపయోగపడుతుంది. మెహందీ అనేది కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదు, ఇది ఒక కళాత్మక వ్యక్తీకరణ. కొత్త సంవత్సరం వేడుకలకు తగినట్లుగా ఆధునిక డిజైన్లు, సంప్రదాయ డిజైన్లు, ఫ్లోరల్ మోటిఫ్స్, అబ్స్ట్రాక్ట్ డిజైన్లు ఇలా ఎన్నో రకాల డిజైన్లు ఉన్నాయి. అందులో కొన్ని డిజైన్‌లు మీకోసం..
మెహందీ డిజైన్స్ అనేది భారతదేశం, ఇతర దేశాలలో ప్రసిద్ధి చెందిన శరీర అలంకరణ కళ. ఇది సాధారణంగా చేతులు, కాళ్ళపై అప్లై డిజైన్స్‌ను వేసుకుంటారు. మెహందీ డిజైన్స్ సాంప్రదాయకంగా పండుగలు, వివాహాలు ఇతర ముఖ్యమైన సందర్భాలలో మహిళలు వేసుకుంటారు.
మెహందీ డిజైన్స్ వివిధ రకాలు ఉంటాయి. అందులో ఎక్కువగా వేసుకొనేవి అరబిక్ మెహందీ డిజైన్స్, రాజస్థానీ మెహందీ డిజైన్స్, మొఘలాయి మెహందీ డిజైన్స్. ఇవి ఎక్కువగా పండుగలు, వివాహాలకు వేసుకుంటారు. ఇవి చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి.
2025 నూతన సంవత్సరానికి మెహందీ పెట్టుకోవాలనుకుంటున్నారా? మెహందీ చేతులకు అందాన్ని మరింత పెంచుతుంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కొన్ని మెహందీ డిజైన్‌లు ఇక్కడ ఉన్నాయి. మీరు ఇష్టమైన డిజైన్‌ని ఎంచుకోవచ్చు.
మంగళ్యం మెహందీ: ఇది క్లాసిక్, ఎప్పటికీ ట్రెండీగా ఉండే డిజైన్. మీ చేతులకు పూర్తిగా కవర్ చేసే విధంగా లేదా కొన్ని భాగాలకు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ డిజైన్‌ను వేసుకోవడానికి మహిళులు ఇష్టపడుతున్నారు.
అరబిక్ మెహందీ: ఇది సన్నటి లైన్లు, క్లిష్టమైన డిజైన్లతో కూడిన ఆధునిక డిజైన్. ఇది చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈ డిజైన్‌ను ఎక్కువగా వేసుకుంటారు. న్యూఇయర్‌కు ఈ డిజైన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.
ఇండియన్ మెహందీ: ఇది భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఇందులో గులాబీలు, చిన్న చిన్న ఆకులు, బిందువులు వంటి డిజైన్లు ఉంటాయి. ఈ డిజైన్ వేసుకుంటే చేతులు అందంగా ఉన్నట్లు కనిపిస్తాయి.
కూల్ మెహందీ: ఇది సింపుల్, మోడరన్ డిజైన్. ఇది కేవలం కొన్ని వేళ్లకు లేదా చేతి వెనుక భాగానికి పెట్టుకోవచ్చు. మెహందీ సింపుల్‌గా కనిపించాలంటే ఈ డిజైన్ మీకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
డోట్ వర్క్ మెహందీ: ఇది చాలా సులభమైన, అందమైన డిజైన్. ఇది వివిధ ఆకారాలలోని బిందువులతో చేయబడుతుంది. అతి తక్కువ సమయంలో దీని వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.
లీఫ్ మెహందీ: ఇది ప్రకృతిని ప్రేమించే వారికి అనువైన డిజైన్. ఇందులో వివిధ రకాల ఆకుల డిజైన్లు ఉంటాయి. చిన్న పిల్లలకు ఈ డిజైన్‌లు ఎంతో నచ్చుతాయి.
ఇక ఆలస్యం చేయకుండ మీరు కూడా ఈ ట్రెండింగ్ మెహందీ డిజైన్‌లు ట్రై చేయండి. న్యూఇయర్ రోజు మీ లూక్ అదిరిపోతుంది.