NPS Retirement Planning: రిటైర్‌మెంట్ తర్వాత ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆదాయాన్ని పొందే పెన్షన్ కోసం చూస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే చాలా మంది వివిధ రకాల బ్యాంక్‌లకు సంబంధించిన పెన్షన్ పథకాలకు డబ్బులు జమ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS)లో ఉండే పథకాల్లో కూడా చాలా పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇది మార్కెట్-లింక్డ్ స్కీమ్ కావడంతో ఇందులో డబ్బులు జమ చేస్తే భారీ మొత్తంలో పెన్షన్ పొందవచ్చు.
ప్రస్తుతం చాలా మంది ఈ జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS)లో భాగంగా ప్రతి నెల అధిక పెన్షన్ పొందడానికి వివిధ రకాల పథకాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. అయితే ఈ రోజు రూ. 8.84 కోట్ల ఎన్‌పిఎస్ కార్పస్ కలిగిన అద్భుతమైన పెన్షన్ పథకం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే..
రూ. 8.84 కోట్ల ఎన్‌పిఎస్ కార్పస్‌లో భాగంగా ముందుగానే ప్రతి నెల కేవలం రూ.10 వేలు చెల్లించి ఏకంగా రిటైర్‌మెంట్ తర్వాత రూ. 2 లక్షల నెలవారీ పెన్షన్ పొందవచ్చట.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ NPS ఖాతాను ఎంతో సులభంగా తెరుచుకునే సదుపాయాన్ని అందిస్తోంది. అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్ లేదా పెన్షన్ ఫండ్‌తో పాటు ప్రధాన బ్యాంక్‌లలో కూడా ఈ ఖాతాను సులభంగా తెరిచే సదుపాయన్ని అందిస్తోంది. ఈ ఖాతాకు ముందుగా రూ. 1,000 కనీస డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఖాతా తెరవాలనుకునేవారి వయస్సు దాదాపు 18 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుందని కేంద్ర తెలిపింది. అలాగే గరిష్టంగా వయస్సు దాదాపు 70 సంవత్సరాలు ఉండాలి.
NPSలో రెండు రకాల పెట్టుబడులు ఉంటాయి. నిబంధనల ప్రకారం.. 50 ఏళ్లలోపు ఉన్నవారికి దాదాపు 75 శాతం ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను అందిస్తోంది. ఇక 60 సంవత్సరాలకు పైగా ఉన్నవారికి దాదాపు 50 శాతం మించకుండా అదిస్తోంది. అయితే దీని అధిక పెన్షన్ అనేది ఇన్వెస్ట్ చేసే డబ్బులను బట్టి ఆధారపడి ఉంటుంది.
ఇక ఇలా విత్‌డ్రా చేసిన మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌లోకి మార్చుకునే సదుపాయాన్ని అందిస్తోంది. దీనినే నెలవారి పెన్షన్‌గా టర్న్ చేసుకోవచ్చు. ఇక టైర్ II NPS ఖాతా కలిగిన ప్రతి ఒక్కరు వారు పెట్టిన పెట్టుబడి మొత్తం డ్రా చేసుకోవచ్చు.
ఇక ఇలా విత్‌డ్రా చేసిన మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌లోకి మార్చుకునే సదుపాయాన్ని అందిస్తోంది. దీనినే నెలవారి పెన్షన్‌గా టర్న్ చేసుకోవచ్చు. ఇక టైర్ II NPS ఖాతా కలిగిన ప్రతి ఒక్కరు వారు పెట్టిన పెట్టుబడి మొత్తం డ్రా చేసుకోవచ్చు.
ఇందులో పెట్టుబడి పెట్టేవారు ప్రతి నెల దాదాపు రూ.10 వేలు 5 సంవత్సరాలు పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో పెన్షన్ పొందవచ్చు. అలాగే వీరికి NPS ప్రతి ఏడాది 5 శాతం వరకు ప్రత్యేకంగా వడ్డీని కూడా అందిస్తుంది.
ఈ NPS స్కీమ్‌లో దాదాపు 35 ఏళ్ల పెట్టుబడి పెట్టిన వారికి లెక్కల ప్రకారం.. మొత్తం పెట్టుబడి రూ.1,08,38,434 అవుతుంది. ఇక కార్పస్ రూ. 7,75,22,722 అవుతుంది. అన్ని కలుపుకుని దాదాపు రూ. 8,83,61,159 కంటే ఎక్కువగా అవుతుంది.
ఈ మొత్తంలో నుంచి దాదాపు రూ.5,30,16,695 విత్‌డ్రా చేసుకున్న మనకు యాన్యుటీ దాదాపు రూ. 3,53,44,464 ఉంటుంది. అయితే దీనిని పెన్షన్ కిందికి మార్చుకోవచ్చు.
ఇలా మొత్తం యాన్యుటీ విలువ రూ. 3,53,44,464ను పెన్షన్ కిందికి మార్చుకుంటే దాదాపు NPS ఖాతాదరుడి ప్రతి నెల పెన్షన్ రూ. 1,98,813 వస్తుంది. అంటే దాదాపు రూ.2 లక్షల వరకు పెన్షన్ లభిస్తుంది.