Rasi Phalalu Telugu: నేటి రాశి ఫలాలు..ఫిబ్రవరి చివరి రోజు ఈ రాశులవారికి అదృష్టం వరించబోతోంది!

Today Rasi Phalalu - నేటి రాశి ఫలాలు (ఫిబ్రవరి 29, 2024): ఫిబ్రవరి చివరి రోజు గ్రహాలు నక్షత్రాల పరంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా అనేక రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

1 /12

ఫిబ్రవరి చివరి రోజు మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ పనిలో రాణించి డబ్బులు పొందుతారు. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగు పడతాయి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఆర్థిక లాభాలు కలిగి ఛాన్స్‌ కూడా ఉంది.  

2 /12

వృషభం ఈ నెల చివరి రోజు అంతగా బాగుండక పోవచ్చు. మీ పనిలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.   

3 /12

ఫిబ్రవరి చివరి రోజు మిథునం (Gemini) వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి పనుల్లోనైన రాణించి విజయాలు సాధిస్తారు. అలాగే ఆరోగ్యంగా కూడా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.   

4 /12

ఈ రోజు కర్కాటక రాశివారికి కొంచెం ఒత్తిడితో కూడిన రోజు. మీ పనిలో అనేక ఆటంకాలు కలుగుతాయి. మీ కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.

5 /12

ఈ నెల చివరి రోజు సింహ రాశివారికి అదృష్టాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబంతో కలిసి షాపింగ్‌కి వెళ్తారు. ఆరోగ్యం కూడా ఇంతక ముందు కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. అలాగే ఆరోగ్యం కూడా బాగుటుంది.   

6 /12

కన్యా రాశివారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా స్నేహితులతో సంబంధాలు మరింత బలంగా మారుతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజు డబ్బు కూడా పొందుతారు.   

7 /12

తుల రాశి వారికి ఫిబ్రవరిలోని చివరి రోజు చాలా కష్టతరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి పనుల్లో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభించకపోవడంతో మానసికంగా బాధపడతారు. ముఖ్యంగా వీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే తీవ్రవ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.  

8 /12

వృశ్చిక రాశి వారికి ఈ నెల చివరి రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి పనుల్లోనైనా రాణించి ఆర్థికంగా బలంగా తయారవుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడడంతో వారి నుంచి ప్రోత్సాహం కూడా పొందుతారు. ఎప్పటినుంచో ఎదుర్కొంటున్నా అనారోగ్య సమస్యలు ఈరోజు నుంచి ఉపశమనం లభిస్తుంది.

9 /12

ధనస్సు రాశి వారికి కూడా ఫిబ్రవరి చివరి రోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుంది. పని భారం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.. కాబట్టి ప్రశాంతంగా మనసుపెట్టి పని చేయడం చాలా మంచిది. అంతే కాకుండా ఇతరులతో తగాదాలకు కూడా దిగుతారు.  

10 /12

ఫిబ్రవరి చివరి నెలలో చివరి రోజు మకర రాశి వారికి కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారికి పని భారం గట్టిపడి సమస్యల్లో ఇరుక్కునే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఆరోగ్యం క్షీణించి మానసిక సమస్యలు కూడా వస్తాయి. కుటుంబ సభ్యులతో గొడవ పడతారు.  

11 /12

కుంభ రాశి వారికి ఈరోజు కూడా శని దేవుడు అనుగ్రహం లభించబోతోంది. ఈ ఫిబ్రవరి చివరి రోజు ఎలాంటి పనులు చేసిన ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే కుటుంబ సభ్యుల సపోర్టు లభించి వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. ఇంతకుముందున్న తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులనుంచి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది.

12 /12

మీన రాశి వారు ఫిబ్రవరి చివరి రోజు ఎంతో సృజనాత్మకంగా ఉంటారు. కాబట్టి కొత్తగా ఆలోచించి పనులు చేయడం వల్ల ఊహించని లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఈ చివరి రోజు కలిసి వస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా సుఖంగా గడుపుతారు.