Fenugreek Leaves Benefits: మెంతికూర ఒక ప్రసిద్ధ ఆకుకూర. ఇది భారతదేశం ఇతర దక్షిణాసియా దేశాలలో చాలా ఇష్టంగా తింటారు. ఇది కేవలం రుచికరమైనదే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.
Fenugreek Leaves Benefits: మెంతికూర ఒక రుచికరమైన ఆకుకూర మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, సి, కె, కాల్షియం, ఐరన్ , పొటాషియం ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీని తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే మెంతికూరను తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
డయాబెటిస్ నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతికూర ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యం: చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడంలో మెంతికూర ఎంతో సహాయపడుతుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను పెంచుడంలో సాయపడుతుంది.
జీర్ణక్రియ మెరుగుదల: మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. దీంతో తయారు చేసిన ఆహారపదార్థాలను రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
బరువు తగ్గడం: మెంతికూర ఆకలిని అణచివేస్తుంది. అధిక బరువు పెరగకుండా సహాయపడుతుంది. అలాగే శరీర జీవక్రియను పెంచుతుంది.
వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది: మెంతికూరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.
జుట్టు ఆరోగ్యానికి మంచిది: జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. మెంతికూర గింజలతో తయారు చేసిన నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఋతు సమస్యలను నియంత్రిస్తుంది: ఋతునొప్పిని తగ్గిస్తుంది. అలాగే రుతుస్రావ సమస్యలను నియంత్రిస్తుంది.