Kiara Advani:పెళ్లి తర్వాత కూడా గ్లామర్ విషయంలో అదే దూకుడు చూపిస్తోన్న కియారా అద్వానీ.. గేమ్ ఛేంజర్ పైనే అమ్మడి ఆశలు..

Kiara Advani: కియారా అద్వానీ ఉత్తరాది భామ అయినా ముఖ్యంగా దక్షిణాదిలో అందులో టాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  కియారా తెలుగులో  మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో ఇక్కడ ప్రేక్షకులకు చేరువైంది. అంతేకాదు కెరీర్ పీక్స్ ఉన్న సమయంలో తన తోటి నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత అందాల ఆరబోతలో ఎక్కడ మొహమాట పడటం లేదు. 

1 /7

కియరా అద్వానీ తెలుగులో మహేష్ బాబు హీరోగా  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో  తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ సినిమా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడంలో విఫలమైంది.    

2 /7

త్వరలో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పలకరించబోతుంది. ఇందులో కియారా పాత్రకు మంచి ఇంపార్టెన్స్  ఉందట. కథానాయకుడితో సరిసమానమైన పాత్రలో అలరించబోతుందట.

3 /7

  కియారా కెరీర్ పీక్స్ లో ఉండగానే.. తన తోటి నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. వీరి మ్యారేజ్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యఘర్ ప్యాలెస్ లో జరిగింది.

4 /7

కియారా అద్వానీ.. 2014లో బాలీవుడ్ మూవీ ‘ఫగ్లీ’ మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఆమె అసలు పేరు ఆలియా అద్వానీ. అప్పటికే అలియా భట్ హీరోయిన్ గా  బాలీవుడ్ ను ఏలుతూ ఉండటంతో తన పేరును కియారాగా మార్చుకుంది.

5 /7

ఇక ఎం.ఎస్.ధోని జిందగీ మీద తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’ అన్ టోల్డ్ స్టోరీ మూవీతో బాలీవుడ్ లో మొదటి హిట్ అందుకుంది. సినిమాల్లోనే కాకుండా.. లస్ట్ స్టోరీస్ వంటి వెబ్ సిరీస్ లో హాట్ హాట్ గా నటించి యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

6 /7

కియారా.. బట్టలు లేకుండా న్యూడ్ గా  చేసిన ఫోటో షూట్ అప్పట్లో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. ఇక హిందీలో అక్షయ్ కుమార్ తో ‘లక్ష్మీ’తో పాటు ‘భూల్ భులయ్యా 2’, జుగ్ జుగ్ జియో, సత్య్ కీ ప్రేమ్ కథ వంటి చిత్రాల్లోని నటనతో మంచి పేరు సంపాదించుకుంది. 

7 /7

మొత్తంగా పెళ్లి తర్వాత కూడా కియారా అద్వానీ యంగ్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తూ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ లేపుతూనే ఉంది.