Manmohan Singh Net Worth: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ.. ఇవన్నీ ఎవరికి సొంతమంటే..?

Manmohan Singh Inheritance: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన పలు విషయాలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఆస్తుల గురించి.. ఇక అవి ఎవరికి సొంతమవుతాయి అనే దాని గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. మరి పూర్తి వివరాల్లోకి వెళితే..
 

1 /5

కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) తుది శ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థకు గురై ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచినట్లు వైద్య బృందం నిర్ధారించింది. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 

2 /5

1991 నుంచి 1996 వరకు పీ.వీ.నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్,  ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు అంటే దాదాపు 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా సేవలు అందించారు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన ప్రధాన మంత్రుల్లో ఒకరిగా రికార్డు సృష్టించారు మన్మోహన్ సింగ్. ఇక ఈయన జన్మస్థలం మా.. పంజాబ్. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. ఈయన వ్యక్తిగత విషయానికే వస్తే.. 1958 సెప్టెంబర్ 14వ తేదీన 'గురు శరణ్ కౌర్' ను వివాహం చేసుకున్నారు.  

3 /5

ఆ తర్వాత వీరికి ముగ్గురు కుమార్తెలు.. ఉపిందర్ సింగ్, అమృత్ సింగ్, ధామన్ సింగ్. ఇదిలా ఉండగా ఈయన మరణించడంతో ఈయన ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈయన ఆస్తులు ఎవరికి చెందుతాయి అని కూడా కామెంట్ల వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.   

4 /5

2018లో మన్మోహన్ సింగ్ రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసినప్పుడు.. అఫిడవిట్ లో ఆయన రూ.15.77 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీ, చండీగఢ్ లో ఫ్లాట్లు ఉన్నాయని తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక రుణాల నుండి విముక్తి పొందినట్లు తెలిపారు. 2018 - 19 సంవత్సరానికి గానూ ఈయన మొత్తం ఆదాయం రూ.90 లక్షలు, ఆయన నివాస ఆస్తులు బ్యాంకు డిపాజిట్లతో పాటు ఇతర అపార్ట్మెంట్స్ విలువ 11 సంవత్సరాల క్రితం రూ.7.27 కోట్లుగా ఉండేది.   

5 /5

2013 అఫిడవిట్ ప్రకారం పోస్టల్ సేవింగ్స్ స్కీమ్ లో ఆయన వద్ద రూ.12,76,000 ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు ఎస్బిఐ ఖాతాలో రూ.3.46 కోట్ల డిపాజిట్లు  పెట్టుబడులు కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే ఈయన దగ్గర మారుతి 800 కార్ తో పాటు మరికొన్ని ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈయనకు కొడుకులు లేరు. కాబట్టి ముగ్గురు కూతుర్లు కావడంతో ముగ్గురికి ఆస్తులు సమానంగా వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.