Nora Fatehi struggle to success: సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డవారే. కానీ ఒక్కసారిగా ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే స్టార్ స్టేటస్ లభిస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి. ఒక్కొక్కసారి చెప్పులు అరిగేలా సంవత్సరాల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా అవకాశాలు లభించవు.
ఇండస్ట్రీలో అవకాశం లభించాలంటే ఎంతో కష్టపడాలి. ఒకవేళ అవకాశాలు లభించినా.. తమ నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగే పాత్రలై ఉండాలి. లేకపోతే ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి ఉంటుంది. అలా ఒకానొక సమయంలో 100 రూపాయల కోసం పనిచేసిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
ఆ తర్వాత కాలంలో తమ నటనతో అందచందాలతో ప్రేక్షకులను మెప్పించి, ప్రస్తుతం స్టార్ హోదాను దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ బ్యూటీ నోరా ఫతేహి కూడా ఒకరు.
ఒకప్పుడు ₹100 జీతంతో సినిమాలలో పనిచిన ఈమె నేడు 4 నిమిషాలు పని చేస్తే చాలు రూ .2కోట్లు పారితోషకం తీసుకునే స్థాయికి ఎదిగింది. దీన్ని బట్టి చూస్తే నోరా ఫతేహి తన కష్టంతో ఎంతలా ప్రేక్షకులను ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చర్చలు జరిగేవి. చాలామంది నటీమణులు ఇలా ఐటమ్ సాంగ్స్ చేసి భారీ పాపులర్ అయ్యారు. కాలం మారుతున్న కొద్దీ ఐటమ్ సాంగ్స్ కి ప్రాధాన్యత పెరుగుతోంది.
ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కాకుండా స్పెషల్ సాంగ్ అనే పదాన్ని దర్శకులు వాడుతున్నారు. అలా స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను మెప్పించిన బ్యూటీ నోరా ఫతేహి.. రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమాలో మనోహరి అనే పాటలో కనిపించి యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ లో అదరగొట్టిన ఈ బ్యూటీకి సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. నోరా ఫతేహీ ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద క్రేజీ ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
ఇదిలా ఉండగా కెరియర్ తొలినాళ్లల్లో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్న ఈమె వాటిని మైలురాళ్లుగా నిలబెట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో స్థిరపడింది. ఈమె ప్రతిభకు అదృష్టం కూడా తోడైంది. నేడు అగ్ర నతీమణులలో ఒకరిగా చలామణి అవుతూ.. సోషల్ మీడియాలో టాప్ స్టార్ గా పేరు దక్కించుకుంది.