Black Cars: ప్రపంచంలో అగ్రనేతల కార్ల రంగు నలుపే ఎందుకుంటుంది, కారణమేమైనా ఉందా

Black Cars: సాధారణంగా ప్రపంచంలో ఏ దేశంలో అయినా అగ్రనేతల  కార్ల రంగు నలుపే ఉంటుంది. జీ20 శిఖరాగ్ర సమావేశానికి విచ్చేసిన ప్రపంచ దేశాధినేతల కార్లు కూడా ఇండియా చేరుకున్నాయి. ఇవన్నీ నలుపు రంగులోనే ఉన్నాయి. 
 

Black Cars: ప్రపంచంలో అగ్రనేతల కార్లన్నీ దాదాపుగా నలుపు రంగులోనే ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ ఎందుకనేది కారణం తెలుసా..బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఆ కారణాలేంటో మనం తెలుసుకుందాం..
 

1 /5

అమెరికాలో అయితే నలుపు రంగును సీక్రెట్ సర్వీస్ కూడా ఉపయోగిస్తుంటుంది. అధ్యక్షుడి వాహనం రంగు అనాదిగా నలుపే ఉంటోంది. ఈ సాంప్రదాయం అలా కొనసాగుతూ వస్తోంది.

2 /5

ఇండియాలో కూడా కార్ల రంగు నలుపు చాలాకాలంగా వస్తున్నదే. నలుపు అనేది శక్తి, బలం, అధికారం, హోదాకు ప్రతీకగా కూడా భావించవచ్చు.

3 /5

రంగుల వాడకం ప్రారంభమైనప్పుడు నలుపు రంగు అనేది సాంప్రదాయ రంగుగా ఉండేది. ఈ రంగును చిత్రలేఖన, పాండులిపి, వాహనాలకు వినియోగించేవారు. ఆ సమయంలో వాహనాలు నలుపు రంగులోనే ఉండేవి.

4 /5

దేశ రాజధాని ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాధినేతలు ఇండియాకు వచ్చారు. వాళ్లతో పాటు వారి కార్లు కూడా చేరుకున్నాయి. అన్నింటి రంగు నలుపే ఉంది. అన్నింటీ రంగు నలుపే ఎందుకుందనే విషయాన్ని ఓ మీడియా నివేదిక వెల్లడించింది. వాస్తవానికి దీనివెనుక పెద్ద రహస్యం లేదా నిబంధన ఏదీ లేదట. కేవలం సాంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీ అట.

5 /5

ప్రపంచాధినేతల కార్లు కూడా ఆకర్షిస్తుంటాయి. దేశంలోని టాప్ సెక్యూరిటీ ఫోర్స్ తమ తమ ప్రధాని లేదా అధ్యక్షుల భద్రతకు పెద్దపీట వేస్తుంటారు. 24 గంటల నిఘా ఉంటుంది. దాంతోపాటే ఈ నేతల కార్ల రంగు నలుపే ఎందుకుంటుందనేది ఎప్పుడైనా ఆలోచించారా..