Morocco Earthquake Pics: భూకంపంతో మొరాకో విధ్వంసం, చారిత్రక యునెస్కో హెరిటేజ్ సిటీ ధ్వంసం ఫోటోలు మీ కోసం

Morocco Earthquake Pics: ఆఫ్రికా దేశమైన మొరాకోలో నిన్న అంటే శుక్రవారం రాత్రి భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.8 గా నమోదైన భూకంపం ధాటికి విలయం సాక్షాత్కరించింది. భారీ భవంతులు నేలకూలాయి. వేయి మందికి పైగా మృత్యువాత పడగా 3 వేలమంది గాయాలపాలయ్యారు. 

Morocco Earthquake Pics: భూకంపం కారణంగా చారిత్రాత్మక మరాకేశ్ నగరం నుంచి అట్లాస్ మౌంటెయిన్ వరకూ ఉన్న ఊర్లలో చాలా భవంతులు నేలకూలాయి. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని తెలుస్తోంది. భూ ప్రకంపనలు ప్రారంభం కాగానే పెద్దఎత్తున జనం రోడ్లపైకి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.

1 /5

ఓ వ్యక్తి తన ఫ్లాట్‌లో ప్రవేశిస్తుండగా ఒక్కసారిగా గోడకు తగిలించిన వస్తువులు, స్టాండ్‌లోని ప్లేట్స్, గిన్నెలు పడిపోసాగాయి. ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామంటున్నారు.

2 /5

భారీ భవంతులు కూలి శిధిలాలు కుప్పకూలిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతటా దుమ్ము దూళి కన్పిస్తోంది. మరాకేశ్ నగరానికి నలువైపులా నిర్మించిన ప్రఖ్యాత ఎర్ర గోడలకు నష్టం వాటిల్లింది. యునెస్కో హెరిటేజ్ సెంటర్లలో మరాకేశ్ ఒకటి

3 /5

మొరాకో మీడియా నివేదిక ప్రకారం మరాకేష్ నగరం అత్యంత చారిత్రాత్మక నగరం. 12వ శతాబ్దానికి చెందిన కుతూబియా మసీదుకు నష్టం వాటిల్లింది. కానీ ఏ మేరకు అనేది ఇంకా తెలియదు. 

4 /5

మొరాకో హోంమంత్రి అందించిన వివరాల ప్రకారం భూకంపం కారణంగా 1037 మంది మరణించారు. వీరిలో అత్యధికులు మరాకేశ్, భూకంప కేంద్రానికి సమీపంలోని 5 ప్రాంతీయులున్నారు. వేలల్లో గాయాలయ్యాయి. సహాయక బృందాలు ఆపరేషన్ కొనసాగుతోంది.

5 /5

అమెరికా జియోగ్రాఫికల్ సర్వే ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల 11 నిమిషాలకు భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతగా నమోదైంది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ఆస్థినష్టం, ప్రాణనష్టం పెరిగింది. 19 నిమిషాల తరువాత 4.9 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.