Geyser Precautions: గీజర్ వాడేటప్పుడు పొరపాటున కూడా చేయకూడని తప్పులు

గీజర్ ఇప్పుడు దాదాపు అందరి ఇళ్లలో ఉంటోంది. అదే సమయంలో గీజర్ ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. చలికాలంలో గీజర్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల పేలిపోవడం, ప్రమాదాలు తరచూ ఉంటున్నాయి. ఈ ప్రమాదాల నుంచి బయటపడేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. గీజర్ విషయంలో పొరపాటున కూడా ఈ పొరపాట్లు చేయకూడదు

Geyser Precautions: గీజర్ ఇప్పుడు దాదాపు అందరి ఇళ్లలో ఉంటోంది. అదే సమయంలో గీజర్ ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. చలికాలంలో గీజర్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల పేలిపోవడం, ప్రమాదాలు తరచూ ఉంటున్నాయి. ఈ ప్రమాదాల నుంచి బయటపడేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. గీజర్ విషయంలో పొరపాటున కూడా ఈ పొరపాట్లు చేయకూడదు

1 /6

చలికాలంలో గీజర్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఏ చిన్న తప్పిదం లేక పొరపాటు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే గీజర్ వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి

2 /6

చాలా మంది గీజర్ వినియోగించేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు. లేదా నిర్లక్ష్యంగా ఉంటారు. గీజర్ అదే పనిగా ఆన్‌లో ఉంటే ఎలక్ట్రిసిటీ బిల్లు అథికంగా రావడం సంగతేమో గానీ గీజర్ డ్యామేజ్ అవుతుంది. ఒక్కోసారి పేలిపోతుంది

3 /6

కొత్త గీజర్ కొన్నప్పుడు మీరే స్వయంగా ఇన్‌స్టాల్ చేసే ఆలోచనలో ఉంటే వెంటనే స్వస్తి చెప్పండి. లేకపోతే ఇబ్బందుల్లో పడతారు. గీజర్ ఇన్‌స్టాల్లేషన్ ఎప్పుడూ నిపుణుడితోనే చేయించుకోవాలి. 

4 /6

గీజర్ వినియోగించేటప్పుడు ఎప్పటికప్పుడు వైరింగ్ చెక్ చేస్తుండాలి. స్పార్కింగ్ వస్తుందేమో చెక్ చేసుకోవాలి. లేకపోతే గీజర్ పాడైపోతుంది. పేలిపోయే పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా చలికాలం ప్రారంభమయ్యేటప్పుడు ఓసారి సర్వీసింగ్ చేయిస్తే మంచిది

5 /6

గీజర్ ఎలిమెంట్ పాడయితే రిపేర్ చేయించే కంటే కొత్త గీజర్ కొనుగోలు చేయడం మంచిది. గీజర్ ఎలిమెంట్ మరమ్మత్తు మంచిది కాదు. చలికాలంలో ఎక్కువగా ఉపయోగించడం వల్ల రిస్క్ తీసుకోకూడదు

6 /6

చాలామంది విద్యుత్ బిల్లు తగ్గించే క్రమంలో గ్యాస్ గీజర్ వాడుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. గ్యాస్ గీజర్ పేలిపోయే ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే వీటికి దూరంగా ఉండండి