Jr NTR: బాలయ్య అన్ స్టాపబుల్ షో లో జూ.ఎన్టీఆర్ కి అవమానం.. శత్రువు కన్నా ఘోరంగా..!

Balakrishna unstoppable show: బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతోనే కాదు.. ఆహాలో.. ప్రచారం అవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె..తో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఈ ప్రోగ్రాం లో ఎంతోమంది స్టార్ హీరోలు బాలకృష్ణతో ముచ్చటిస్తూ.. ఇతర హీరోల గురించి వారి అభిప్రాయాలను పంచుకుంటూ.. అందరి ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ప్రోగ్రాం లో జూ.ఎన్టీఆర్ పేరు మాత్రం మొదటి ఎపిసోడ్ నుంచి వినిపించకపోవడం ట్విట్టర్లో పెద్ద డిబేట్ గా మారింది..

1 /7

అన్ స్టాఫబుల్ విత్ ఎన్బికె.. మూడు సీజన్లు..సక్సెస్ఫుల్ గా ముగించుకొని.. ఈ మధ్యనే నాలుగవ సీజన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్లో దాదాపు 6 ఎపిసోడ్లు కాగా.. త్వరలోనే రామ్ చరణ్ ఎపిసోడ్ తో ఈ సీజన్ ముగించనున్నారని వినికిడి. 

2 /7

ఇక ఈ షోలో బాలకృష్ణ తన స్టైల్ హోస్టింగ్ తో అదరగొడుతుండగా.. వచ్చిన గెస్టులు కూడా.. దాదాపు తెలుగు ఇండస్ట్రీలోని అందరూ స్టార్ హీరోల గురించి మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక్కడ వరకు కథ బాగానే ఉన్నా..ఈ షోలో ప్రతి ఒక్క హీరో పేరు వినిపిస్తోంది కానీ.. జూనియర్ ఎన్టీఆర్ పేరు మాత్రం ఎవ్వరు ఎక్కడ ప్రస్తావించకపోవడం.. ప్రస్తుతం ఎన్నో చర్చలకు దారితీస్తోంది. 

3 /7

బాలకృష్ణ , నాగార్జున మధ్య కూడా కొంచెం గొడవ నడిచింది అన్న విషయం అందరికీ తెలిసిందే. బాలయ్య అక్కినేని వ్యాఖ్యల వల్ల.. నాగార్జునతో.. ఈ హీరోకి శత్రుత్వం వచ్చింది అనేది ఎన్నో రోజుల నుంచి ఎంతోమందికి తెలిసిన విషయమే. అలాంటిది నాగార్జున పేరుని కూడా ఈ సీజన్లో పలుమార్లు బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. 

4 /7

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా ప్రతి ఒక్క స్టార్ హీరో గురించి మాట్లాడిన బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ పేరుని ఏ ఎపిసోడ్ లో కూడా తీసుకోరాక పోవడం.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. తమ హీరోని అవమానానికి గురి చేస్తున్నారు అనేది ఎంతో మంది వాదన. 

5 /7

మొన్నటికీ మొన్న దర్శకుడు బాబీ.. ఈ షోకి అటెండ్ కాగా.. బాబీ దర్శకత్వంలో వచ్చిన హీరోలు అందరి గురించి కూడా బాలకృష్ణ ప్రశ్నలు అడిగారు. అయితే బాబి కెరియర్ లో మంచి విజయంగా నిలిచిన సినిమా జై లవకుశ. అంతేకాకుండా ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం.. చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఇలాంటి సినిమా చేసినా కూడా బాబీని..బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ గురించి అడగలేదు 

6 /7

అయితే కొంతమంది మాత్రం ఈ ఎపిసోడ్ లో.. మా వాడితో కూడా సినిమా చేశావు కదా అని.. బాబీ ని బాలకృష్ణ అడగగా..అవును జై లవకుశ అని దర్శకుడు అన్నట్టు.. కానీ ఆహా వారు ఆ లైన్ వరకు ప్రోగ్రాంలో తీసేసినట్టు చెప్పుకొస్తున్నారు. ఇదే కానీ నిజమైతే ఆహావారికి..స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తాము అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 

7 /7

ఏది నిజమో, ఏది అబద్దమో.. పక్కన పెడితే నిజంగానే ఈ సీజన్ మొత్తం కూడా ప్రతి ఒక్క స్టార్ హీరో.. గురించి మాట్లాడిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాత్రం మాట్లాడకపోవడం.. అందరిని నిరాశకు గురి చేసే విషయమే. మరి వీరిద్దరూ కలిసి నందమూరి అభిమానులను.. ఎప్పుడు ఖుషి చేస్తారో ఎదురు చూడాలి.