Gold News: ట్రంపు దెబ్బకు ఒక్క రోజే రూ. 2000 దిగి వచ్చిన తులం బంగారం ధర.. మహిళలకు మొదలైన నిజమైన దివాలీ


Gold Rate Today:  బంగారం ధరలు ట్రంప్ రాకతో భూమార్గం పడుతున్నాయి. ఒక్క దెబ్బతో బంగారం ధర ఒక్కరోజులోనే 2000 రూపాయలు తగ్గింది. తాజాగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి? ఎంత మేర తగ్గే అవకాశం ఉందో తెలుసుకుందాం.
 

1 /6

Gold Rate Today: అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం బంగారం ధరలు భారీగా తగ్గడానికి కారణం అవుతుంది. దీంతో మహిళలు పండగ చేసుకుంటున్నారు. బంగారం ధర ఒక్కరోజే రూ. 2,000 తగ్గింది. దీంతో పసిడి ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.   

2 /6

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 79,130 రూపాయలకు దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73450 రూపాయలుగా ఉంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలోనే బంగారం ధరలు తగ్గడం మొదలుపెట్టాయి.   

3 /6

అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 2750 డాలర్ల నుంచి 2700 డాలర్ల దిగువకు తగ్గిపోయింది. ఫలితాలు వెలువడుతున్న కాసేపటికే బంగారం ధరలు తగ్గడం మొదలుపెట్టాయి. ఎందుకు ప్రధాన కారణం. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం అని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్లో లాభాలు పెరిగే కొద్దీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఈక్విటీ మార్కెట్ల వైపు తరలిస్తూ ఉంటారు.   

4 /6

అలాగే ప్రస్తుతం డాలర్ కూడా భారీగా బలపడింది. ఈ ప్రభావం కూడా బంగారంపై కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించి, ఈక్విటీ మార్కెట్లతో పాటు, అమెరికా బాండ్లను సైతం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అమెరికా ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.   

5 /6

ఎందుకంటే వీటి పైన అమెరికా ప్రభుత్వం హామీతో వడ్డీ లభిస్తుంది. ఈ కారణంగానే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం నుంచి తరలించి ఇతర పెట్టుబడి సాధనాల వైపు పెడుతున్నారు. ఫలితంగా బంగారం ధర ఒక్కరోజులోనే 2000 రూపాయల తగ్గింది. ప్రస్తుతం ఉన్న రేంజ్ లోనే బంగారం ధరలు తగినట్లయితే అతి త్వరలోనే బంగారం మళ్లీ 75 వేల నుంచి 70 వేల రేంజ్ మధ్యలో ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

6 /6

ఇదే జరిగితే పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి పండగ అని చెప్పవచ్చు. ఎవరైతే 82,000 వద్ద బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్లి వెనుకడుగు వేశారో అలాంటి వారికి ప్రస్తుతం ధరలు పెద్ద ఉపశమనం అనే చెప్పవచ్చు. బంగారు అభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది మంచి అవకాశం అని కూడా నిపుణులు చెబుతున్నారు. ధరలు తగ్గినప్పుడే ఆభరణాలు కొనుగోలు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. అయితే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అటు నిపుణులు సూచిస్తున్నారు.