Gold Price Today 27 December 2024: దేశవ్యాప్తంగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. గత కొన్నాళ్లుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం భారీగా పెరిగింది. దీంతో బంగారం కొనుగోలు చేద్దామని ప్లాన్ చేస్తున్న వారిలో ఆందోళన మొదలైంది. బంగారం ధరలు తగ్గినట్లే మరోసారి పెరుగుతుండటంతో భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా పెరగడం ఖాయమంటున్నారు. నేడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Price Today 27 December 2024: వారంలో చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. గత వారంతో బాగా తగ్గిన బంగారం ధర..గత మూడు రోజులుగా పెరుగుతూనే ఉంది. ఇదే బాటలో ఈరోజూ కూడా బంగారం ధర పెరిగింది. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధర రూ. 250 పెరిగింది.
మరోవైపు వెండి ధర కూడా భారీగానే పెరుగుతోంది. ఈ ధరలు చూసి పసిడి ప్రియులు బంగారం కొనేందుకు భయపడుతున్నారు. నిన్నటితో పోల్చితే నేడు శుక్రవారం వెండి ధర స్వల్పంగా పెరిగింది.
ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ బంగారం రూ. 78 వేల రూపాయలు ఉంది. 22 క్యారెట్ గోల్డ్ రేటు చూస్తే 71 వేల 550 రూపాయలు పలుకుతోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధరల్లో కూడా ఈ ఏడాది ఒడిదుడుకులు నెలకొన్నాయి. ఈ నెలలో ఆల్ టైమ్ హై నుంచి వెండి ధర బాగా దిగొచ్చింది. నేడు కిలో వెండి రేటు 1 లక్ష పలుకుతోంది.
MCX ఎక్స్ఛేంజ్‌లో, ఫిబ్రవరి 5, 2025న డెలివరీ కోసం బంగారం 10 గ్రాములకు రూ. 76,930 వద్ద ట్రేడింగ్ ప్రారంభ ట్రేడ్‌లో 0.13 శాతం లేదా రూ. 103 పెరిగింది. బంగారంతో పాటు దేశీయంగా వెండి ధరలు కూడా పెరిగాయి.
MCX ఎక్స్ఛేంజ్‌లో, మార్చి 5, 2025న డెలివరీ కోసం వెండి కిలోకు రూ. 89,905 వద్ద ట్రేడింగ్ ప్రారంభ ట్రేడ్‌లో 0.30 శాతం లేదా రూ. 269 లాభపడింది.
అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి 10 గ్రాముల ధర రూ.78,850 వద్ద ముగిసింది. మరోవైపు స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.90,800 వద్ద ముగిసింది.